Dr. NTR Medical Service Scheme : నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంకి వినతి పత్రం
ఏపీ వైద్య మిత్ర కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ తరపున డాక్టర్ ఎన్ టి ఆర్ వైద్య సేవ ఫీల్డ్ సిబ్బంది ఎం సుదర్శన్ రావు, బి రాంబాబు శనివారం 26-10-2024 మధ్యాహ్నం 2 గంటల సమయంలో చిలకలూరిపేట నవతరం పార్టీ కార్యాలయంలో తమ సమస్యలు పరిష్కారం కోరుతూ కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని రావు సుబ్రహ్మణ్యం కు వినతిపత్రం అందించారు.
వినతి పత్రం లోని అంశాలు : డాక్టర్ ఎన్.టి.ఆర్. వైద్యసేవ పధకంలో గత 17 సంవత్సరాలుగా ఫీల్డ్లో పనిచేస్తున్న సిబ్బందికి (వైద్యమిత్రులు, టీం లీడర్లు, జిల్లా మేనేజర్లు, ఆఫీస్ అసోసియేట్లు మరియు జిల్లా మానిటరింగ్ యూనిట్) క్యాడర్ తో పాటు కనీస వేతనాలు అమలు జరగక ట్రస్ట్ అధికారుల నుండి రాష్ట్ర వైద్యశాఖ అధికారులు, ప్రభుత్వ వైద్యశాఖ మంత్రివర్యులు మరియు ప్రభుత్వ పెద్దలు వీరందరి దగ్గర సమస్యలు ప్రస్తావించిన పరిష్కారానిక నోచుకోలేకపోయాయి.
జరిగిపోయిన కాలంలో ఉద్యోగరీత్యా కొందమంది ఇప్పటికే రిటైర్మెంట్ అయ్యారు. చాలా మంది సిబ్బంది రిటైర్మెంట్ వయస్సుకి దగ్గరలో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఎన్.టి.ఆర్. వైద్యసేవ పథకాన్ని ఇన్సూరెన్స్ పద్ధతిలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.
కాబట్టి ఎన్.టి.ఆర్. వైద్యసేవ పధకంలో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బంది యొక్క ఉద్యోగుల భవిష్యత్తు విధివిధానాలు మరియు మా యొక్క ప్రధాన సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నుండి పూర్తి స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని 15 రోజుల గడువుతో (14.10.2024 నుండి 28.10.2024) ఎ.పి. వైద్య మిత్ర ఎంప్లాయిస్ యూనియన్ తరుపున తమరికి లెటర్ అందించడం జరుగుతుంది. ఈ 15 రోజుల సమయంలో దశల వారి సానుకూలమైన పద్ధతులలో వివిధ రకాలుగా 24.10.2024 డి.సి.గారికి లెటర్ ఇవ్వటం, 25.10. 2024 ప్రజా ప్రతినిధులకు సమస్యలను తెలపటం, 26.10.2024 నల్ల బ్యాడ్జీలతో హాజరవడం, 27.10.2024 పత్రిక ప్రకటనలు నిరసనలు తెలిపే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలుపుతున్నాము.పైన తెలిపిన నిర్ణీత సమయములో మా ప్రధాన డిమాండ్ల పరిష్కారానికై డాక్టర్ ఎన్.టి. ఆర్. వైద్యసేవ ప్రధాన అధికారుల నుండి అలాగే ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ లభించని పక్షంలో ది. 29.10.2024 మంగళవారం రోజు నుండి విధుల బహిష్కరిస్తూ పూర్తిస్థాయి సమ్మెలో పాల్గొంటామని ఏపీ వైద్య మిత్ర కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ తరుపున తెలియజేస్తున్నాము.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు : డాక్టర్ ఎన్.టి.ఆర్. వైద్యసేవ పథకాన్ని ఇన్సూరెన్స్ విధానంలోకి మార్పు చేసినా పధకంలో పనిచేస్తున్న ఫీల్ట్ సిబ్బంది అందరినీ..17 సం॥ల సర్వీస్ని పరిగణనలోకి తీసుకొని క్యాడర్ కల్పించి సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ… ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి, ట్రస్ట్ ఫీల్డ్ సిబ్బందికి నిర్వహించిన వన్ టైం ఎగ్జామ్ ని ఉపసంహరించుకోవాలి, డాక్టర్ ఎన్.టి.ఆర్. వైద్యసేవ పధకంలో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బందికి అందరికీ అంతర్గత ప్రమోషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. చనిపోయిన సిబ్బందికి 15లక్షలు ఎక్సగ్రేషియా కల్పించాలి అలాగే రిటైర్మెంట్ అయిన మరి యు అవుతున్న వైద్యసేవ సిబ్బందికి 10 లక్షలు గ్రాట్యుటీ ఇవ్వాలి.
గమనిక : పైన తెలిపిన ప్రధాన డిమాండ్లు తమరికి ఇచ్చిన గడువులో పరిష్కారం కాని పక్షాన డాక్టర్ ఎన్.టి.ఆర్. వైద్యసేవ ఫీల్డ్ సిబ్బందికి సంబంధించిన అన్ని యూనియన్లు కలిసి సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తమరికి తెలియజేస్తున్నాము.