For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

నవ దళపతి సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' దసరాకి రిలీజ్

03:52 PM Aug 27, 2024 IST | Sowmya
Updated At - 03:52 PM Aug 27, 2024 IST
నవ దళపతి సుధీర్ బాబు  మా నాన్న సూపర్ హీరో  దసరాకి రిలీజ్
Advertisement

నవ దళపతి సుధీర్ బాబు యూనిక్ ఎమోషనల్ సాగా 'మా నాన్న సూపర్‌హీరో'తో అలరించడానికి సిద్ధమౌతున్నారు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

మేకర్స్ మూవీ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు. దసరా పండుగ సందర్భంగా మా నాన్న సూపర్‌హీరో విడుదల కానుంది. సినిమాల విడుదలకు బెస్ట్ సీజన్లలో దసరా ఒకటి. ఫ్యామిలీస్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే కంటెంట్ వున్న 'మా నాన్న సూపర్ హీరో' రిలీజ్ కి దసరా పర్ఫెక్ట్ టైమ్. ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ ని త్వరలోనే రివిల్ చేయనున్నారు. 'మా నాన్న సూపర్‌హీరో' మూవీ ప్రేమ, అనుబంధంకు నిజమైన అర్థాన్ని తెలుసుకుంటూ సోల్ ని కదిలించే జర్నీని ప్రారంభించిన ఫాదర్ అండ్ సన్ డ్రామా. టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

Advertisement GKSC

సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. అనిల్ కుమార్ పి ఎడిటర్, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్. MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి కో రైటర్స్. రాజు సుందరం మాస్టర్‌ కొరియోగ్రాఫీతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నారు. మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ని ప్రారంభించనున్నారు.

Cast : Sudheer Babu, Aarna, Sai Chand, Sayaji Shinde, Raju Sundaram, Shashank, Aamani, and Annie

Technical Crew :

Banner: V Celluloids

In Association with: CAM Entertainment

Director: Abhilash Reddy Kankara

Producer: Sunil Balusu

DOP: Sameer Kalyani

Music Director: Jay Krish

Editor: Anil Kumar P

Creative Producer: Maheshwar Reddy Gojala

Production Designer: Jhansi Gojala

Costume Designer: Rajini

Choreography: Raju Sundaram

Writers: MVS Bharadwaj, Shravan Madala, Abhilash Reddy Kankara

PRO: Vamsi-Shekar

Advertisement
Author Image