Health ఈ షాంపూ తో తలస్నానం చేస్తే జుట్టు తప్పక తప్పకుండా పెరుగుతుంది..
Health ఈ రోజుల్లో మారిపోతున్న ఆరోగ్య శైలి, పెరిగిపోతున్న కాలుష్యంతో ప్రతి ఒక్కరిని జుట్టు ఊడిపోయే సమస్య వేధిస్తుంది. ఎన్ని రకాల షాంపూలు వాడినా.. ఏం చేసినా ఈ సమస్య తగ్గటం లేదు. అయితే ఇందుకు సరైన చిట్కా అందరూ వెనక్కి పొమ్మంటున్నారు. అంటే.. పురాతన కాలంలో ఏం వాడేవారో వాటిని ఉపయోగించడం వల్ల ఫలితం ఉంటుందని గట్టిగా చెబుతున్నారు..
నేటి రోజుల్లో ఉపయోగించే అన్ని షాంపూల్లో ఎన్నో రకాల హానికర పదార్థాలు ఉంటున్నాయి. వీటి వలన జుట్టు మరింత పాడైపోయే అవకాశం ఉంది. అయితే వీటన్నిటినీ కొన్నాళ్లు పక్కన పెట్టి సహజ సిద్ధంగా లభించే పదార్థాల్ని వాడటం వల్ల తప్పకుండా ఫలితం ఉంటుంది.. ఇందులో మొదటగా ఉండేది కలబంద. కలబంద జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. తరచూ జుట్టుకు కలబందను రాసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో కలబంద గుజ్జును వేసి దానిని మరిగించి ఆ నూనెను తలకు రాసుకున్న మంచి ఫలితాలు ఉంటాయి..
కుంకుడుకాయలు కూడా జుట్టు పెరుగుదలకు మంచి మార్గం.. ఉసిరి, కుంకుడుకాయ, శీకకాయ ఈ మూడింటిని సమపాళ్ళలో తీసుకుని.. నీళ్లలో వేసి మరిగించండి. వీటితో జుట్టును రుద్దుకోవడం వల్ల బలంగా దృఢంగా తయారవుతుంది. సహజసిద్ధంగా లభించే ఈ పదార్థాలు వాడటం వల్ల జుట్టుకు ఎలాంటి హాని ఉండదు.. స్వచ్ఛమైన నూనెలో మందార పువ్వులను వేసి మరిగించిన నూనె తలకు రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.