'నారి నారి నడుమ మురారి' సినిమా ఫస్ట్ సింగిల్ దర్శనమే ఏప్రిల్ 7న రిలీజ్
చార్మింగ్ స్టార్ శర్వా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి నిర్మించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య, సంయుక్త కథానాయికలుగా నటించారు.
ఇప్పటికే, సినిమా నుండి ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా మ్యూజిక్ జర్నీ ఏప్రిల్ 7న విడుదల కానున్న శర్వా, సంయుక్త నటించిన దర్శనమే అనే పాటతో ప్రారంభమవుతుంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు.
సాంగ్ పోస్టర్ లో శర్వా, సంయుక్త రొమాంటిక్ బైక్ రైడ్ ఆస్వాదిస్తున్నారు. శర్వా క్యాజువల్ టీ-షర్ట్, బ్లాక్ ప్యాంటులో చాలా స్టైలిష్ గా కనిపిస్తుండగా, సంయుక్త తన సాంప్రదాయ దుస్తులలో అందంగా వుంది
ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్, యువరాజ్ సినిమాటోగ్రఫీ నిర్వర్తిస్తున్నారు. భాను బోగవరపు కథను రాశారు, నందు సావిరిగణ సంభాషణలను అందించారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ సుంకర సహ నిర్మాతగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తారాగణం : శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య
సాంకేతిక సిబ్బంది :
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
కథ: భాను బోగవరపు
డైలాగ్స్: నందు సవిరిగాన
DOP: జ్ఞాన శేఖర్ VS, యువరాజ్
సంగీతం: విశాల్ చంద్ర శేఖర్
సహ నిర్మాత: అజయ్ సుంకర
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా