For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

#APPolitics : తెలుగు జాతికి నా హృదయపూర్వక ధన్యవాదాలు : నందమూరి రామకృష్ణ

Chandrababu, Pawan Kalyan, AP Politics, TDP vs YSRCP
09:15 AM May 17, 2024 IST | Sowmya
Updated At - 09:15 AM May 17, 2024 IST
 appolitics   తెలుగు జాతికి నా హృదయపూర్వక ధన్యవాదాలు   నందమూరి రామకృష్ణ
Advertisement

తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల గురించి నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ అందరికీ శుభ దినం మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎన్నడు కనివిని ఎరుగని, మునుపెన్నడూ చూడని విధంగా ఓటింగ్ జరిగింది.

తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు పక్కనున్న రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తెలుగు వారందరూ ఈ ఓటింగ్ లో పాల్గొనేందుకు కదలి వచ్చారు. అలా కదిలి వచ్చిన తెలుగు జాతికి, తెలుగు యువతకి, తెలుగు మహిళలకు, ఓటరు మహాశయులు అందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ రాక్షస పరిపాలన నుంచి విముక్తి కావడానికి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఎంతో కసితో మీరందరూ భారీ ఎత్తున చాలా దూరాల నుంచి తరలివచ్చారు.

Advertisement GKSC

మీరందరూ తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు భారీగా ఓట్లు వేసినందుకు కూటమి ప్రభుత్వం ఏర్పడి భారీ మెజారిటీతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఇది తథ్యం. తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థులకు భారీ ఎత్తున ఓట్లు వేసి గెలిపిస్తున్నందుకు యువతీ యువకులకు, ఓటర్ మహాశయులకు తెలుగు జాతి మొత్తానికి పేరుపేరునా మా తెలుగుదేశం పార్టీ తరఫున, కుటుంబం తరపున అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మీ నందమూరి రామకృష్ణ.

Advertisement
Author Image