నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్ లాంచ్ చేసిన #Sharwa37 టైటిల్ 'నారి నారి నడుమ మురారి' ఫస్ట్ లుక్
Nari Nari Naduma Murari : చార్మింగ్ స్టార్ శర్వా 37వ మూవీ #శర్వా37, సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చిత్రీకరణ జరుగుతోంది. అనిల్ సుంకర ఎకె ఎంటర్టైన్మెంట్స్ పై రామబ్రహ్మం సుంకర, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి నిర్మించిన ఈ చిత్రం జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్ గా ఉండబోతోంది.
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రానికి 'నారీ నారీ నడుమ మురారి' అనే టైటిల్ రివిల్ చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ను లాంచ్ చేశారు. ఈ టైటిల్ సినిమా మెయిన్ బ్యాక్ డ్రాప్ ని తెలియజేస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ హీరో డైలామాని చూపిస్తుంది. సాక్షి వైద్య, సంయుక్త మధ్య శర్వా గందరగోళ పరిస్థితిలో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది.
పోస్టర్‌లో ఇద్దరు అమ్మాయి శర్వా చెవుల్లో అరవడం, అతను చెవులను మూసుకోవడం కనిపిస్తోంది. కాగితాలు ఎగురుతూ గందరగోళం, హ్యుమర్ ని యాడ్ చేస్తున్నాయి. ఈ సన్నివేశం ఒక లైటర్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కోసం టోన్ ని సెట్ చేస్తుంది. శర్వా ట్రెండీ దుస్తులలో ఎట్రాక్టివ్ గా కనిపిస్తుండగా, సాక్షి వైద్య, సంయుక్త ఇద్దరూ మెరుస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ జాయ్ ఫుల్ వైబ్‌ను కనిపిస్తోంది, ఈ చిత్రం యువత, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుంటుంది.
నారీ నారీ నడుమ మురారికి అత్యుత్తమ సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, జ్ఞాన శేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భాను బోగవరపు కథను రాస్తున్నారు, నందు సావిరిగణ సంభాషణలను అందిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సహ నిర్మాతగా అజయ్ సుంకర వ్యవహరిస్తున్నారు. ప్రధాన నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
Cast : Sharwanand, Samyuktha, Sakshi Vaidya
Technical Crew :
Screenplay, Direction: Ram Abbaraju
Producers: Anil Sunkara, Ramabrahmam Sunkara
Banners: AK Entertainments, Adventures International Pvt Ltd
Story: Bhanu Bogavarapu
Dialogues: Nandu Savirigana
DOP: Gnana Shekar VS
Music: Vishal Chandra Shekar
Co-producer: Ajay Sunkara
Ex-Producer: Kishore Garikipati
PRO: Vamsi-Shekar
Digital: Vishwa CM