For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

"నందమూరి బాలకృష్ణ" హీరో హర్ష్ కనుమిల్లిని "వర్జిన్ స్టార్" అని పిలిచాడు... ఎందుకో తెలుసా ?

02:56 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:56 PM May 11, 2024 IST
 నందమూరి బాలకృష్ణ  హీరో హర్ష్ కనుమిల్లిని  వర్జిన్ స్టార్  అని పిలిచాడు    ఎందుకో తెలుసా
Advertisement

Nandamuri Balakrishna, Harsh Kanumilli,Simran Choudary, Gangasagar Dwarakas Sehari Teaser Out,

హ‌ర్ష్ క‌నుమిల్లి, జ్ఞాన సాగ‌ర్ ద్వార‌క‌, వ‌ర్గో పిక్చ‌ర్స్`సెహ‌రి` టీజ‌ర్ విడుద‌ల‌...

Advertisement GKSC

హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌధ‌రి హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతోన్న`సెహ‌రి` మూవీ టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ ఈ రోజు (ఏప్రిల్ 16) విడుద‌ల‌చేసింది. ఈ బృందం ప్రత్యేకమైన ప్రమోషన్లు మరియు హర్ష్‌ను వర్జిన్ స్టార్ అని పిలిచే  ప్రకటన వీడియో `సెహ‌రి` టీజ‌ర్  మంచి  రెస్పాన్స్ సంపాదించడానికి  ఎంత‌గానో ఉపయోగ‌ప‌డింది. వ్యూహాత్మకంగానే వారు బాలకృష్ట‌గారి ప్రసంగాన్నిసెహారీ టీజర్‌లో చేర్చ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.

బాలకృష్ణగారు గ‌తంలో హర్ష్ కనుమిల్లిని వర్జిన్ స్టార్ అని పేర్కొన్న విష‌యం తెలిసిందే.. అందుకే ఈ చిత్ర  బృందం కూడా  అదే ట్యాగ్ లైన్ ద్వారా అతన్ని పిలవాలని నిర్ణయించుకుంది. "మేము బాలకృష్ణ గారి ప్రసంగాన్నిసెహారీ టీజర్‌లో చేర్చాము. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు మేము కృత‌జ్ఞత‌లు తెలుపుతున్నాము" అని మేకర్స్ ప్ర‌క‌టించారు.

తన ప్రియురాలితో క‌లిసి ఆనందకరమైన జీవితాన్నిగడిపే వరుణ్ పాత్రలో హర్ష్ కనుమిల్లి క‌నిపించారు. ఒక్క‌సారిగా త‌న‌తో బ్రేక‌ప్ అవ‌డం, దాంతో మ‌రోక‌రితో వివాహానికి సిద్ద‌మ‌వ‌డం మ‌నం ఈ టీజ‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఆ త‌ర్వాత త‌ను వివాహం చేసుకోబోయే అమ్మాయి అక్క సిమ్రాన్ చౌదరితో సన్నిహితంగా ఉండ‌డం ద్వారా త‌న భాగ‌స్వామి ఎంపిక సరైనది కాదని అతను గ్రహించడం టీజ‌ర్లో చూపించారు.

హ‌ర్ష్ క‌నుమిల్లి కామెడి టైమింగ్ ఈ టీజ‌ర్‌కి మేజ‌ర్ హైలెట్ అని చెప్పొచ్చు.

ద‌ర్శ‌కుడు జ్ఞాన సాగ‌ర్  ద్వారక `సెహ‌రి` చిత్రాన్ని యూత్ ఫుల్ రామ్‌- కామ్‌ ఎలిమెంట్స్‌తో ఆహ్లాద‌కరంగా ‌
తెర‌కెక్కించారు. ప్రశాంత్ ఆర్ విహారీ నేపథ్య సంగీతం ఆకర్షణీయంగా ఉంది.

శిల్ప చౌదరి భాగస్వామ్యంతో వ‌ర్గో పిక్చ‌ర్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా అద్వ‌య జిష్ణు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది.

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కోటి ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర పోషించారు.

తారాగ‌ణం:
హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌధ‌రి, అభిన‌వ్ గోమటం, ప్ర‌ణీత్ రెడ్డి, అనీషా అల్ల, అక్షిత హ‌రీష్‌, కోటి, బాల‌కృష్ణ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కత్వం: జ్ఞాన సాగ‌ర్ ద్వారక‌,
నిర్మాత‌లు: అద్వ‌య జిష్ణు రెడ్డి, శిల్పా చౌధ‌రి,
సినిమాటోగ్ర‌ఫి: సురేష్ సారంగం
ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజ‌ల‌
సంగీతం: ప్ర‌శాంత్ ఆర్ విహారి
ఆర్ట్‌: సాహి సురేష్‌.
పిఆర్ఒ: వంశీ- శేఖ‌ర్‌.

Cast: Harsh Kanumilli, Simran Choudary, Abhinav Gomatam, Praneeth Reddy, Anisha Alla, Akshitha Harish, Koti, Balakrishna and others.

Technical Crew:
Director: Gnanasagar Dwaraka
Producer: Advaya Jishnu Reddy, Shilpa Chowdary
D.O.P: Suresh Sarangam
Music Director: Prashanth R Vihari
Editor: Raviteja Girijala
Art Director: Sahi Suresh

https://youtu.be/4kOwuMgQiNw

Advertisement
Author Image