For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

#TelanganaNews : ఉద్యోగులను, యువతను మోసం చేసింది కాంగ్రెస్ : గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే

Guntakandla Jagadish Reddy, SRPT, MLA, Telangana News
10:00 AM May 17, 2024 IST | Sowmya
Updated At - 10:00 AM May 17, 2024 IST
 telangananews   ఉద్యోగులను  యువతను మోసం చేసింది కాంగ్రెస్   గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే
Advertisement

ఉద్యోగులు ,యువతను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని, మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కృతనిచ్చయంతో యువత ఉద్యోగులు ఉన్నారని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ- వరంగల్ , ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సూర్యాపేట జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఎన్నికల ప్రచారం లో అనుసరించాల్సిన విధివిధానాలపై శ్రేణుల కు దిశా నిర్దేశం చేశారు. ప్రచారంలో ఓటర్లను కలుస్తున్న సందర్భంగా ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరుద్యోగులు, యువత ఎండగడుతున్నారని తెలిపారు. బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయానికి కావలసిన సానుకూల వాతావరణం నియోజకవర్గం లో ఉందన్నారు.

Advertisement GKSC

కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సిద్ధంగా ఉన్న ,ప్రతి ఓటర్ ను కలావాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల తరహాలో వారం రోజులు బిఆర్ఎస్ శ్రేణులు ప్రజా క్షేత్రంలో కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. మన పని విధానమే మన విజయానికి నాంది అని తెలిపారు. సిట్టింగ్ స్థానాన్ని బి.ఆర్.ఎస్ నిలబెట్టుకోవడం ఖాయమన్నారు.

Advertisement
Author Image