For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Telugu Film industry : టాలీవుడ్ జాతీయ అవార్డు విజేతల కోసం అగ్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ సెలబ్రేషన్స్

09:41 PM Oct 22, 2023 IST | Sowmya
Updated At - 09:41 PM Oct 22, 2023 IST
telugu film industry   టాలీవుడ్ జాతీయ అవార్డు విజేతల కోసం అగ్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ సెలబ్రేషన్స్
Advertisement

జాతీయ అవార్డులో సత్తా చాటిన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణులను సన్మానించడానికి శనివారం అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో టాలీవుడ్ చెందిన ప్రముఖ హీరోలు, దర్శకులు, నిర్మాతలు పలువురు నటీనటులు పాల్గొన్నారు. "పుష్ప"చిత్రంతొ ప్రపంచవ్యాప్తంగా పాపులరైన మన తెలుగు నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో తన అద్బుత నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రానికి గాను రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు కైవసం చేసుకన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ లను మైత్రీ మూవీమేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ లతో పాటు ఈ వేడుకకు విచ్చేసిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు దర్శక, నిర్మాతలు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ... దేవిశ్రీ ప్రసాద్ నేను పుష్ప చిత్రానికి జాతీయ అవార్డులు అందుకోవడం సంతోషంగా వుంది. ఏదైనా మనం మనసులో గట్టిగా అనుకుంటే జరుగుతుందని అంటుంటారు. అయితే మనం అనుకున్నా, కష్టపడినా అది యాభై శాతం మాత్రమే జరుగుతుంది. మిగతా యాభై శాతం మన చుట్టుపక్కల వాళ్లు కోరుకోవాలి. అప్పుడే అది జరగుతుంది. నాకు జాతీయ అవార్డు రావాలనే కోరిక వుండేది. అయితే నా కంటే నాకు అవార్డు రావాలని బలంగా కోరుకున్న వ్యక్తి దర్శకుడు సుకుమార్. నేను అచీవ్ మెంట్ అయితే సుకుమార్ అచీవర్. సుకుమార్ నన్ను ఎంత ఇష్టపడతాడో నాకు తెలుసు. నా ఫర్ ఫార్మెన్స్ విషయంలో నేను రాజీపడిన తను ఎప్పుడూ రాజీపడేవాడు కాదు. పుష్స సినిమా విషయంలో నాకు నటుడిగా పేరు రావడం కోసం ఎంతో తపన పడేవాడు‘ అన్నారు. అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడం ఎంతో సంతోషంగా వుందని, సినిమా కోసం ఎంతో కష్టపడతాడు, అతని కష్టానికి తగిన ప్రతిఫలమే ఈ జాతీయ అవార్డు అని ప్రకాష్ రాజ్ అన్నారు.

Advertisement GKSC

దేవి ప్రసాద్ మాట్లాడుతూ... ’అల్లు అర్జున్ గురించి ప్రకాష్ రాజ్ గారు చెప్పిన ప్రతి మాట ఎంతో వాస్తవం. సినిమా పట్ల తపన వున్న వ్యక్తి సుకుమార్. మా కాంబినేషన్ లో పనిచేయడం ఎంతో ఆనందంగా వుంటుంది. మైత్రీమూవీ మేకర్స్ నిర్మాతల అంటేనే రాజీపడని నిర్మాతలు. ఇక రాబోతున్న పుష్ప-2కు సుకుమార్ రాసిన విధానం, తీసిన విధానం ఒక లెవల్ అయితే అల్లు అర్జున్ చేసిన విధానం ఇంకో లెవల్. నేను కొన్ని సన్నివేశాలు చూశాను. ఇంతకు మించి నేను ఇంకేమీ చెప్పలేను అన్నారు.

Advertisement
Author Image