For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

తళుక్కుమనే భామలతో ఫ్యాషన్ షో తో మై గ్లామ్ ఎక్సిబిషన్

01:38 PM Jun 22, 2024 IST | Sowmya
Updated At - 01:38 PM Jun 22, 2024 IST
తళుక్కుమనే భామలతో ఫ్యాషన్ షో తో మై గ్లామ్ ఎక్సిబిషన్
Advertisement

My Glam : ఎప్పటి నుండో హైదరాబాదులోని ఫ్యాషన్ ప్రియులు ఎదురుచూస్తున్న మై గ్లామ్ ఎగ్జిబిషన్ హైదరాబాదులో శుక్రవారం 21 జూన్ నుండి శనివారం 22 జూన్ వరకూ రెండు రోజుల పాటూ నిర్వహించబడుతోంది. ఎంతో నైపుణ్యంతో ఎంపిక చేయబడిన హైదరాబాదు జ్యూయలరీ తయారుదారుల ద్వారా రూపుదిద్దుకొన్న జ్యూయలరీ తో పాటూ జాతీయంగా పేరు గడించిన ప్రముఖ ప్యాషన్ హవుస్ లు రూపొందించిన డిజైనర్ వేర్ మరియు సుందరంగా తీర్చిదిద్దబడిన చీరలు ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించబడి ఫ్యాషన్ ప్రియులకు అందుబాటులో ఉంటాయి.

ఎగ్జిబిషన్ సందర్శనకు వచ్చే వారి కోసం

Advertisement GKSC

• సంబ్రమపరిచే జ్యూయలరీ – ఎంపిక చేసిన ప్రఖ్యాత జ్యూయలరీ తయారీదార్ల ద్వారా రూపొందించబడిన జ్యూయలరీ మరియు లగ్జరీ ఆభరణాలు
• డిజైనర్ వేర్ – పేరుగడించిన ప్యాషన్ డిజైనర్ల ద్వారా రూపొందించబడిన లేటెస్ట్ ఫ్యాషన్ వేర్

• వినూత్నంగా రూపొందించబడిన చీరలు – మహిళలకు ప్రతి ఒక్క కార్యక్రమానికి సరిపడేలా తీర్చిదిద్దబడిన చీరలు

ఈ ఎగ్జిబిషన్ లో ప్రఖ్యాతి గడించిన ఫ్యాషన్ హవుస్ లైన దేవి పవిత్ర, SPAI, నిక్కి జ్యూయలర్స్, ఇన్ఫినిట్ స్పార్కల్, లిటిల్ లూమ్ లోర్, ట్రెడిషనల్ టెంప్టేషన్, పియాంషీ కలెక్షన్ – కలకత్తా, వస్త్రం లు పాల్గొంటున్నాయి. మహిళలకు ఎంతో ఆసక్తి కలిగించే ఈ ఎగ్జిబిషన్ నేటి సాయంత్రం పేరెన్నిక గలిగిన మాడల్స్ ద్వారా నిర్వహించబడిన ష్యాషన్ షో తో ప్రారంభమైంది. ఈ ఫ్యాషన్ షో ద్వారా ఎగ్జిబిషన్ లో ప్రదర్శించబడే ఫ్యాషన్ వేర్, జ్యూయలరీ లను మాడల్స్ చక్కగా ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు మిస్ సుచరిత మరియు మనోజ్ పట్వర్థన్ లు మాట్లాడుతూ...బంజారాహిల్స్ లోని సిటీ సెంట్రల్ మాల్ ప్రక్క లేన్ లేదా తాజ్ కృష్ణా హోటల్ కు ఎదురు లేన్ లోని లేబల్స్ పాప్ అప్ స్పేస్ లో నిర్వహించబడుతున్న ఈ ప్రదర్శనను సందర్శించి ప్రదర్శితమవుతున్న ఫ్యాషన్ వేర్, జ్యూయలరీ ను స్వయంగా ఆస్వాదించవచ్చన్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో పేరు గడించిన ఫ్యాషన్ లేబల్స్ పాల్గొంటున్న ఈ రెండు రోజుల ఎగ్జిబిషన్ లో అన్ని రకములై సామాజిక కార్యక్రమాలకు నప్పే లగ్జరీ మరియు స్టైల్ తో కూడిన ఫ్యాషన్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.

For more information, please contact:

https://www.instagram.com/myglamexhibition/
https://www.facebook.com/myglamexhibition

Advertisement
Author Image