ఈ నెల 20న "మర్డర్" రిలీజ్
11:22 PM Sep 09, 2024 IST | Sowmya
Updated At - 11:22 PM Sep 09, 2024 IST
Advertisement
ట్రెండ్ సెట్టర్ చిత్రాల సృష్టి కర్త రాంగోపాల్ వర్మ హారర్, పొలిటికల్ కథా చిత్రాలతో పాటు సమాజ ఇతివృత్తాలను ఆధారం చేసుకుని అనేక చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ కోవలోనే ఆయన మలచిన చిత్రం "మర్డర్".
శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రీ భార్గవి, సాహితీ, గిరిధర్, దీపక్, గణేష్ ప్రధాన పాత్రధారులు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆనంద్ చంద్ర దర్శకత్వంలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా రాంగోపాల్ వర్మ దీనిని తెరకెక్కించారు. దీనిని ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.
ఓ జంట ప్రేమ వివాహానంతరం జరిగిన పరువు హత్య నేపథ్యంలో ఈ సినిమాను తనదైన రీతిలో వర్మ తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం: డిఎస్ఆర్, డివోపి: జగదీష్ చీకటి ఎడిటింగ్: శ్రీకాంత్ పట్నాయక్.
Advertisement