For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

#TollywoodNews : సరికొత్త పద్దతిలో సినిమా ప్రకటన

12:35 PM Dec 20, 2020 IST | Sowmya
UpdateAt: 12:35 PM Dec 20, 2020 IST
 tollywoodnews   సరికొత్త పద్దతిలో సినిమా ప్రకటన
Advertisement

గత కొంతకాలంగా కరోనా వలన అందరూ ఇళ్లల్లోనే ఉన్న సంగతి మనందరికీ తెలిసినదే. కేవలం ఇంటికే పరిమితం అయ్యి ఉండాలంటే వినోదాన్ని ఎన్నుకోవడం చేస్తున్నారు. అందులో అందరూ ఎక్కువగా ఇష్టపడే వినోదం సినిమా. ఈ సినిమా మనిషికి తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదాన్ని అందిస్తుంది.

అయితే ఈరోజుల్లో ఆడియన్స్ ని సంతృప్తి పరచాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సినిమా హిట్ అవ్వడం గగనంగా మారింది పరిస్థితి. దీనికి తోడు సినిమాకి ప్రకటన చాలా అవసరం. కొన్ని సినిమాలు అవి వచ్చినట్టు, వెళ్లినట్టు కూడా ఎవ్వరికీ తెలియకుండా ఉంటాయి. అలాంటి సినిమాలు నిర్మాతకు నష్టాన్ని మిగిలిస్తూ వెళ్లిపోతాయి.

Advertisement GKSC

ఐకా ఫిల్మ్ ఫాక్టరీ బ్యానర్ పై అసిఫ్ ఖాన్ మరియు మౌర్యాని హీరో హీరోయిన్స్ లుగా నటిస్తున్న సినిమా "నేడే విడుదల". ఈ సినిమా ద్వారా ఒక కొత్త డైరెక్టర్ సినిమా రంగానికి పరిచయం అవుతున్నారు. అతని పేరు రామ్ రెడ్డి పన్నాల కాగా, ఈ సినిమా  సినిమా రంగానికి సంబంచించిన ఒక పాయింట్ మీద ఈ కథ నడుస్తుంది. లోబడ్జట్ లో తీసే ఈ సినిమాకి ప్రమోషన్ మాత్రం వినూత్నంగా చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని, ఫస్ట్ సాంగ్ ని విడుదల చేశారు. అయితే అందరిలా కాకుండా, దీని ద్వారా ప్రమోషన్ బాగా చేసుకున్నారు. ఇవి రెండూ ప్రేక్షకులతోనే విడుదల చేయిస్తాము అని ప్రకటన ఇచ్చి అందరినీ మెసేజ్ చెయ్యమని చెప్పారు. దీనితో అనేక మంది నుంచి మెసేజెస్ వచ్చాయి. అందులో ఇద్దరిని లక్కీ డ్రా ద్వారా ఎన్నుకుని, వారితో ఆ ఫస్ట్ లుక్ ఒకరితో, సాంగ్ ఒకరితో ఓపెన్ చేయించారు.

Advertisement
Tags :
Author Image