For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Telangana Politics : సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

CM Revanth Reddy Comments on Telangana Vidyut Employees
04:02 PM May 15, 2024 IST | Sowmya
Updated At - 04:02 PM May 15, 2024 IST
CM Revanth Reddy Comments on Telangana Vidyut Employees
telangana politics   సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి  ఎమ్మెల్యే హరీష్ రావు
Advertisement

కరెంట్ కోతల విషయంలో సిఎం రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే భాద్యుడిని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తున్నది.

బిఆర్ఎస్ ప్రభుత్వం, 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు.. విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించింది. రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్ప కూల్చింది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైంది.

Advertisement GKSC

తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను చీటికి మాటికి నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే. విద్యుత్ ఉద్యోగుల పై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరం.

సీఎం ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు మాని కేసీఆర్ గారి హయాంలో రెప్ప పాటు కూడా పోని విధంగా 24 గంటల విద్యుత్ ను ఇచ్చినట్టుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిది. తన లాగే అందరూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతారని సీఎం భ్రమల్లో ఉన్నట్టున్నారు. వాటిని వీడి పాలన పై దృష్టి పెడితే మంచిది.

https://x.com/brsharish/status/1790665193522930048?s=12&t=iIisDuhURU6c7v0zsLSt0w

Advertisement
Author Image