For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

COVID NEWS: 3rd వేవ్ ను ఎదురుకునేందుకు ( CTRMA) తో ZOOM APP ద్వారా సెమినార్.

02:59 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:59 PM May 11, 2024 IST
covid news  3rd వేవ్ ను ఎదురుకునేందుకు   ctrma  తో zoom app ద్వారా సెమినార్
Advertisement

Minister Srinivas Goud, Covid News, #CTRMA, Telangana News, Telangana Politics, Confederation of Telugu Region Malayalee Associations, Telugu World Now,

COVID NEWS: 3rd వేవ్ ను ఎదురుకునేందుకు ( CTRMA) తో ZOOM APP ద్వారా సెమినార్.

Advertisement GKSC

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు కాన్ఫెడరేషన్ ఆఫ్ తెలుగు రీజియన్ మళయాళి అసోసియేషన్( CTRMA) ఇన్ అసోసియేషన్ విత్ మళయాళం మిషన్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో కోవిడ్ - 19 నివారణ లో భాగంగా 3వ వేవ్ ను ముందస్తుగా సమర్ధవంతంగా ఎదురుకునేందుకు అవగాహన కోసం ZOOM APP ద్వారా నిర్వహించిన సెమినార్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం లో నివసించే అన్ని రాష్ట్రాల ప్రజలను సొంత ప్రజల వలే ఆదరిస్తున్నారన్నారు. ముఖ్యంగా కేరళ ప్రజలు, మళయాళ ప్రజలంటే సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక అభిమానమన్నారు మంత్రి శ్రీ V . శ్రీనివాస్ గౌడ్ గారు. తెలంగాణ రాష్ట్రంలో మళయాళ ప్రజలు అందిస్తున్న సేవలను కీర్తించారు. అభినందనలు తెలియజేశారు. కేరళ - తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎంతో అనుబంధం ఉందన్నారు. కేరళ రాష్ట్రంలో గతంలో కురిసిన భారీ వర్షాల వల్ల అతులకుతులం అయినపుడు సీఎం కేసీఆర్ గారు కేరళ ప్రభుత్వానికి అపన్నహస్తం అందించారన్నారు. సీఎం కేసీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలు కేరళ ప్రజలకు ఎంతో సహకారం అందించారన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. కోవిడ్ నియంత్రణ లో బాగంగా సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉన్నారన్నారు. ఇప్పటికే ముందస్తు నివారణ చర్యలు చేపట్టామన్నారు. అవసరమైన మందులు, ఆధునిక వైద్య పరికరాలు, లాబ్ లను ప్రారంభించామన్నారు. తెలంగాణ రాష్ట్రం లో నివసిస్తున్న అన్ని రాష్ట్రాల ప్రజలను సొంత ప్రజల వలె సంరక్షిస్తామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.

Minister Srinivas Goud, Covid News, #CTRMA, Telangana News, Telangana Politics, Telugu World Now,

Advertisement
Author Image