For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మతిభ్రమించింది : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

11:01 PM Jun 02, 2024 IST | Sowmya
Updated At - 11:02 PM Jun 02, 2024 IST
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మతిభ్రమించింది   మాజీ మంత్రి  ఎమ్మెల్యే హరీశ్ రావు
Advertisement

ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది వాస్తవం. అయితే నేను అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్ రావును కలిసినట్టు ఈరోజు మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మతిభ్రమించింది. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిది. నేను అమెరికా వెళ్లి, ప్రభాకర్ రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధం. రుజువు చేయకపోతే వెంకట్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలి. నేను ఏ దేశం వెళ్లాను, ఏ హోటల్‌లో ఉన్నాను తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.

నా పాస్‌పోర్ట్‌తో సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు వస్తాను. పాస్‌పోర్టులో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయి.కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి గారు మాట్లాడటం చౌకబారుతనం. కోమటిరెడ్డి గారి దగ్గర ఉన్న వివరాలతో రుజువు చేయాలని, ఆధారాలతో రావాలని డిమాండ్ చేస్తున్నాను. ఆధారాలతో రాని పక్షాన బేషరతుగా క్షమాపణ చెప్పాలి.అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. కోమటిరెడ్డి గారు చెప్పిన తేదీన, చెప్పిన టైంకి అమరవీరుల స్తూపం వద్దకు నేను వస్తాను, మీ ఆధారాలతో మీరు రండి.

Advertisement GKSC

టీవీల్లో బ్రేకింగ్ స్క్రోలింగ్‌ల కోసం చిల్లర వ్యాఖ్యలు చేయడం మాని పాలనపై దృష్టి సారించాలి. నిరాధార నిందలు వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకునే చౌకబారు ప్రయత్నాలు మానుకొని కోమటిరెడ్డి గారు తన హుందాతనాన్ని నిలుపుకోవాలి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి. ఆ భగవంతుడు మీకు సద్భుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

Advertisement
Author Image