బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలకు లేని నెట్ వర్క్ మనకుంది: మంత్రి హరీశ్ రావు
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇబ్రహీంపట్నం - మంత్రి హరీశ్ రావు కామెంట్స్.
7 0 నుండి 80 శాతం ఓటింగ్ ఉండేలా చూడాలి.
ఓటింగ్ శాతం పెరిగితే మనదే విజయం.
బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలకు లేని నెట్ వర్క్ మనకుంది.
కష్టపడి పని చేస్తే గెలుపు ఖాయం.
ఓటరును నేరుగా కలిసి తెరాసకు ఎందుకు ఓటు వేయాలో వివరించండి.
బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థులకు ఓటు వేస్తే వచ్చే లాభం ఏముంది.
వారేమైనా అధికారంలో ఉన్న వారా..
తెలంగాణ అంటే ఒకప్పుడు నిషేధం .
తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్, తెరాసది.
ఎన్నికల కోసమే కాంగ్రెస్ తెలంగాణ. పేరు ఉచ్చరించేంది.
బీజేపీ వాళ్లు ఇన్నేళ్లు అధికారంలో ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఇంటింటికితాగు నీరు ఇచ్చారా.
కేంద్రం మన మిషన్ భగీరథను కాపీ కొచ్టింది.
70 ఏళ్లు కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉండి తాగు నీరు ఇచ్చారా.
రైతు బందు ను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి ఆరు వేల రూపాయలు ఇస్తోంది.
ఓనాడు నీటి తీరువా, శిస్తులు ప్రభుత్వాలు వసూలు చేస్తే తెరాస వచ్చాక ఎకరానికి పది వేలు రైతు బందు ఇచ్చాం.
తెలంగాణా వచ్చే నాటికి 7778 మెగా వాట్లు కాగా, నేడు 16 వేల మెగావాట్లుకు చేరింది.
తెలంగాణ లో తప్ప దేశంలో ఎక్కడయినా ఉచితవిద్యుత్ 24 గంటలు ఏ రాష్ట్రంలో అయినా ఇస్తున్నారా..
పేదింటి పెళ్లికి లక్షరూపాయలు ఇస్తున్నాం. ఇదేకాపీ కొట్టి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తోంది.
బీజేపీ కి ఇవ్వాల్సినవి ఇవ్వడం చేతగాదు.
రేల్వే కోచ్ ఫ్యాక్టరీ, వెనుకబడిన ప్రాంతానికి 400 కోట్లు ఇస్తామని, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ ఇస్తామని హామీ ఇచ్చారు. దమ్ముంటే బీజేపీ నేతలు వీటిని తెచ్చి మాట్లాడండి.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశవృద్ది రేటు 8శాతం ఉంటే నేడు మైనస్ 8శాతానికి పడిపోయింది. అదే తెలంగాణ 14 శాతం వృద్ధి రేటు సాధించింది.
తెలంగాణ కోసం రాజీనామాలంటే కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా తప్పించుకున్నారు.
ఇబ్రహీంపట్నం కు కృష్ణా నీరు తెస్తాం.
ప్రశ్నించే గొంతు అంటున్నారు. మేం పరిష్కారంచేసే వారం. పని చేసే చేతల మనిషి.
సురభి వాణి దేవి పీవీ కుమార్తె కాకుండా విద్యావేత్త.
సేవా భావం కలిగిన వ్యక్తి.
ఏకైక మహిళా అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.