For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి : SS Thaman పై మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస‌లు

08:29 PM Jan 18, 2025 IST | Sowmya
UpdateAt: 08:29 PM Jan 18, 2025 IST
నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి   ss thaman పై మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస‌లు
Advertisement

Megastar Chiranjeevi : సోష‌ల్ మీడియాలో నెగెటివిటీ రోజు రోజుకీ పెరిగిపోతుంది. సెల‌బ్రిటీల‌ను, సినిమాల‌ను టార్గెట్ చేస్తూ మ‌రీ ముఖ్యంగా ఈ నెగెటివిటీ ఎక్కువైపోతుంది. దీనిపై బాహాటంగా మాట్లాడేవాళ్లు త‌క్కువ‌గా ఉంటున్నారు. కానీ మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ నెగెటివిటీపై రీసెంట్‌గా జ‌రిగిన కార్య‌క‌క్ర‌మంలో చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ..

‘‘డియర్ తమన్,
నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ... వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా  అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది.  విషయం సినిమా అయినా క్రికెట్ అయినా, మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, మాటలు మనలో స్ఫూర్తిని నింపుతాయి. అవే మాటలు మనల్ని నాశనం కూడా చేస్తాయి. మీకేం కావాలనేది మీరే నిర్ణయించుకోండి. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు  నడిపిస్తుంది. Thoughtful words my dear ! God Bless !’’ అన్నారు.

Advertisement

Advertisement
Tags :
Author Image