For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Prathinidhi 2 : ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో 'ప్రతినిధి 2' చిత్రం విడుదలకు సిద్ధమ్

05:59 PM Mar 29, 2024 IST | Sowmya
UpdateAt: 05:59 PM Mar 29, 2024 IST
prathinidhi 2   ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో  ప్రతినిధి 2  చిత్రం విడుదలకు సిద్ధమ్
Advertisement

హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ చిత్రం ప్రతినిధి 2. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ అయిన 'ప్రతినిధి 2' టీజర్  మెగాస్టార్ చిరంజీవి ఈరోజులాంచ్ చేశారు.

హీరో ఒక టీవీ ఛానెల్‌లో పనిచేసే నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్. ఒక అగ్ర రాజకీయ నాయకుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో, అతను రాష్ట్రం యొక్క అప్పుల గురించి ఆరా తీయగా, 5 లక్షల కోట్లు సమాధానం ఇస్తాడు నాయకుడు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే అప్పులు తీరుతాయని రాజకీయ నాయకుడు చెప్పగా.. అప్పుడు హీరో.. రాష్ట్రంలో నిజంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? అని ప్రశ్నిస్తాడు.  చివరి ఎపిసోడ్‌లో హీరో ప్రజలను ఓట్లు వేయమని, లేకుంటే దేశం విడిచి వెళ్లమని హెచ్చరించడం ఆలోచన రేకెత్తిస్తుంది. టీజర్ లో సచిన్ ఖేడేకర్, రఘు బాబు, జిషు సేన్‌గుప్తా, ఉదయ భాను, అజయ్ గోష్, శ్రీ ఇతర ప్రముఖ పాత్రలను కూడా పరిచయం చేశారు.

Advertisement

ఈ ఇంటెన్స్ టీజర్ అద్భుతంగా ఆకట్టుకుంది. నారా రోహిత్ న్యూస్ రిపోర్టర్ పాత్రలో ఒదిగిపోయారు. తన ఇంటెన్స్ నటనతో పాత్రకు బలాన్ని తీసుకొచ్చారు. మూర్తి దేవగుప్తపు తన రైటింగ్,  టేకింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇంటర్వ్యూ ఎపిసోడ్  ఓటరు హక్కులు , బాధ్యతల గురించిన చివరి సీక్వెన్స్ అద్భుతంగా వున్నాయి. నాని చమిడిశెట్టి కెమెరా పనితనం నీట్ గా ఉంది, యువ సంచలనం మహతి స్వర సాగర్ తన అద్భుతమైన స్కోర్‌తో కథనానికి బలం చేకూర్చారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్. ప్రొడక్షన్ డిజైన్ గ్రాండ్ గా వుంది. మేకర్స్ అనౌన్స్ చేసినట్లుగా, ప్రతినిధి 2 ఈ సంవత్సరం ఏప్రిల్‌లో థియేటర్స్ లో విడుదల కానుంది.

Advertisement
Tags :
Author Image