Gentleman-2 : మెగా ప్రొడ్యూసర్ కె.టి కుంజుమోన్ 'జెంటిల్‌మన్ 2' మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి
10:49 PM Oct 30, 2023 IST | Sowmya
UpdateAt: 10:49 PM Oct 30, 2023 IST
Advertisement
మెగా ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమోన్ జెంటిల్‌మన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై “జెంటిల్‌మన్-2” చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. చేతన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార చక్రవర్తి, ప్రియాలాల్ కథానాయికలు. చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.
15 రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో చేతన్, నయనతార చక్రవర్తి, ప్రియా లాల్, బాడవ గోపి, సుధా రాణి, సితార, శ్రీ లత, కన్మణి, లొల్లు సభ స్వామినాథన్, బేబీ పద్మ రాగం , ముల్లై-కోతాండమ్‌లు పాల్గొన్నారు. స్టంట్ కొరియోగ్రఫర్ దినేష్ కాసి సూపర్ విజన్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు. సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ మేజర్ హైలెట్ ఉండబోతుంది. తదుపరి షెడ్యూల్ నవంబర్ మూడవ వారంలో ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్ చెన్నై, హైదరాబాద్ , పాండిచ్చేరిలో గ్రాండ్ గా చిత్రీకరించనున్నారు. మిగతా షెడ్యూల్‌లను మలేషియా, దుబాయ్, శ్రీలంకలో చిత్రీకరిస్తారు.
ఈ చిత్రంలో చేతన్, నయనతార చక్రవర్తి, ప్రియా లాల్, సుమన్, మనోజ్ కె జయన్, ప్రసిక్క, కాంతారావు విలన్ అచ్యుత్ కుమార్, బాడవ గోపి, మునీష్ రాజా, ఆర్.వి.ఉదయకుమార్, సెంద్రాయన్, మైమ్ గోపి, రవి ప్రకాష్, శిశిర్ శర్మ, వేల రామమూర్తి, జాన్ మహేంద్రన్, కల్లూరి విమల్, జిగర్తాండ రామ్స్, ప్రేమ్ కుమార్, ఇమ్మాన్ అన్నాచ్చి, ముల్లై, కోతాండమ్, శ్రీ రామ్, జాన్ రోషన్, లొల్లు సభ స్వామినాథన్, జార్జ్ విజయ్, నెల్సన్, సితార, సుధా రాణి, శ్రీ రంజని, సత్య ప్రియ, కన్మణి, మైనా నందిని, శ్రీ లత, కారుణ్య, బాబు పద్మ రాగం, బేబీ, అనీషా.. దాదాపు 50 మంది ప్రముఖ నటీనటులు ఈ స్టార్ కాస్ట్‌లో భాగమౌతున్నారు.
ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా, వైరముత్తు సాహిత్యం సమకూరుస్తున్నారు. అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తోట తరణి ఆర్ట్ వర్క్స్‌ని పర్యవేక్షిస్తున్నారు. సతీష్ సూర్య ఎడిటర్. బృందా డ్యాన్స్ కొరియోగ్రఫీ అందిస్తుండగా, జెరీనా స్టైలిస్ట్‌గా, పూర్ణిమ రామసామి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేస్తున్నారు. జి. మురుగ బూపతి, శరవణ కుమార్ ప్రొడక్షన్ కంట్రోలర్స్.
Advertisement