తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లండన్ లో "మెగా బతుకమ్మ వేడుకలు" పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Mega Batukamma Celebrations Poster Launched by Telangana Jagruthi MLC Kalvakuntla Kavitha in Lodon, Telugu World Now,
తెలంగాణ జాగృతి లండన్ విభాగం ఆధ్వర్యంలో జరిగే మెగా బతుకమ్మ వేడుకల పోస్టర్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి నాయకులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు.
తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 10 వ తేదీన లండన్ లో మెగా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. బతుకమ్మ వేడుకల్లో యూకే తెలంగాణ జాగృతి ప్రతినిధులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. అక్టోబర్ 10 వ తేదీన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా చేనేత చీరలను అందించనున్నామని తెలంగాణ జాగృతి యూకే విభాగం అధ్యక్షులు సుమన్ బల్మూరి పేర్కొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్, స్టేట్ జనరల్ సెక్రెటరీ నవీన్ ఆచారి, స్టేట్ సెక్రెటరీ రోహిత్ రావు, తెలంగాణ జాగృతి నాయకులు ప్రశాంత్ పూస, నితిష్, రోహిత్ రావ్, దినేష్ రెడ్డి, అనుషా దుర్గా, జితూ, రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.