For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood News: "మాతృదేవోభవ" (ఓ అమ్మ కథ) పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి !!

12:33 PM Sep 26, 2021 IST | Sowmya
UpdateAt: 12:33 PM Sep 26, 2021 IST
tollywood news   మాతృదేవోభవ   ఓ అమ్మ కథ  పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి
Advertisement

శ్రీవాసవి మూవీస్ పతాకంపై కె.హరనాథ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చోడవరపు వెంకటేశ్వరావు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న చిత్రం "మాతృదేవోభవ". 'ఓ అమ్మ కథ' అన్నది ఉప శీర్షిక. సీనియర్ నటి సుధ తన కెరీర్ లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రం ద్వారా పతంజలి శ్రీనివాస్-అమృతా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ప్రముఖ రచయిత మరుదూరి రాజా సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రంలో సుమన్, రఘుబాబు, పోసాని, చమ్మక్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు కె.హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ... "ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని అవమానవీయ సంఘటనలకు అద్దం పడుతూ ప్రముఖ రచయిత కె.జె.ఎస్.రామారెడ్డి (సితారె) రాసిన కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. భర్తను కోల్పోయి పిల్లల కోసమే బ్రతికి, వాళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఓ మాతృమూర్తికి పిల్లల వల్ల ఎదురైన చేదు సంఘటనల సమాహారమే మా "మాతృదేవోభవ". సుధ గారి అభినయం, మరుదూరి రాజా సంభాషణలు ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయి. హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న పతంజలి శ్రీనివాస్-అమృతా చౌదరి చాలా బాగా చేశారు. యువతరం మెచ్చే అంశాలు కూడా "మాతృదేవోభవ"లో పుష్కలంగా ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సార్ చేయిస్తాం. మా నిర్మాత చోడవరపు వెంకటేశ్వరావు గారికి చక్కని శుభారంభం ఇచ్చే చిత్రమవుతుంది" అన్నారు.

Advertisement

Matrudevobhava Movie is Now Under Post Production, Dr Actress Sudha, Hero Suman, Director K Haranadh Reddy, Latest Telugu Movies, Telugu World Now,సూర్య, జెమిని సురేష్, శ్రీహర్ష, సత్యశ్రీ, సోనియా చౌదరి, అపూర్వ, కీర్తి, జబర్దస్త్ అప్పారావు, షేకింగ్ శేషు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైన్స్: కృష్ణప్రసాద్, ఫైట్స్: డైమండ్ వెంకట్, కెమెరా: రామ్ కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి, సంగీతం: జయసూర్య, పాటలు: అనంత్ శ్రీరామ్-పాండురంగారావు- దేవేందర్ రెడ్డి, మాటలు: మరుదూరి రాజా, కథ: కె.జె.ఎస్.రామారెడ్డి (సితారె), సమర్పణ: ఎం.ఎస్.రెడ్డి, నిర్మాత: చోడవరపు వెంకటేశ్వరావు, స్క్రీన్ ప్లే-డైరెక్షన్: కె.హరనాథరెడ్డి!!

Matrudevobhava Movie is Now Under Post Production, Dr Actress Sudha, Hero Suman, Director K Haranadh Reddy, Latest Telugu Movies, Telugu World Now,

Matrudevobhava Movie is Now Under Post Production, Dr Actress Sudha, Hero Suman, Director K Haranadh Reddy, Latest Telugu Movies, Telugu World Now,

Matrudevobhava Movie is Now Under Post Production, Dr Actress Sudha, Hero Suman, Director K Haranadh Reddy, Latest Telugu Movies, Telugu World Now,

Advertisement
Tags :
Author Image