For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tiger Nageswara Rao : 'టైగర్ నాగేశ్వరరావు' థర్డ్ సింగిల్ ఇచ్చేసుకుంటాలే

09:31 PM Oct 12, 2023 IST | Sowmya
Updated At - 09:31 PM Oct 12, 2023 IST
tiger nageswara rao    టైగర్ నాగేశ్వరరావు  థర్డ్ సింగిల్ ఇచ్చేసుకుంటాలే
Advertisement

మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావుతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా వున్నారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు.  ఇటివలే విడుదలై ట్రైలర్‌ కు నేషనల్ వైడ్ గా టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలు చార్ట్ బస్టర్స్ హిట్స్ గా అలరిస్తున్నాయి. ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్ ‘ఇచ్చేసుకుంటాలే’ పాటని విడుదల చేశారు. బ్యూటీఫుల్ రొమాంటిక్ మెలోడీగా ఈ పాటని కంపోజ్ చేశారు జీవి ప్రకాష్. భాస్కరభట్ల రవికుమార్ అందించిన సాహిత్యం.. హీరోయిన్ మనసులోని ప్రేమని చాలా అందంగా ఆవిష్కరించింది. సింధూరి మెస్మరైజ్ వాయిస్ తో ఆకట్టుకున్నారు. ఈ పాటలో రవితేజ, గాయత్రి భరద్వాజ్ ల కెమిస్ట్రీ వండర్ ఫుల్ గా వుంది. విజువల్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి.

Advertisement GKSC

నూపుర్ సనన్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత. టైగర్ నాగేశ్వరరావు దసరా సందర్భంగా అక్టోబర్ 20న అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానుంది.

Advertisement
Author Image