For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Eagle : మాస్ మహారాజా రవితేజ 'ఈగల్' ట్రైలర్ డిసెంబర్ 20న

09:42 PM Dec 18, 2023 IST | Sowmya
UpdateAt: 09:42 PM Dec 18, 2023 IST
eagle   మాస్ మహారాజా రవితేజ  ఈగల్  ట్రైలర్ డిసెంబర్ 20న
Advertisement

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం 2024లో విడుదలవుతున్న భారీ అంచనాలున్న సినిమాల్లో ఒకటి. టీజర్ విడుదలైన తర్వాత క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. ఇటివలే విడుదల చేసిన ఈగల్ ఊర మాస్ అంథమ్ ఆడు మచ్చా పాట చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.

ఇప్పుడు మేకర్స్ ఈగల్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న ఈగల్ ట్రైలర్ డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ట్రైలర్ రిలీజ్ డేట్ పోస్టర్ లో రవితేజ పెద్ద మిషన్ గన్ తో ఫైర్ చేసున్న టెర్రిఫిక్ లుక్ లో కట్టిపడేశారు. ఈ సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్య థాపర్ మరో కథానాయిక. నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం.

Advertisement

కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్ & దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిబాబు కరణం డైలాగ్స్ అందించారు. దావ్‌జాంద్ సంగీత సమకూరుస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్. ఈగల్ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement
Tags :
Author Image