For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Laila : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ #VS12 టైటిల్ 'లైలా'

07:27 PM Mar 29, 2024 IST | Sowmya
UpdateAt: 07:27 PM Mar 29, 2024 IST
laila   మాస్ కా దాస్ విశ్వక్ సేన్  vs12 టైటిల్  లైలా
Advertisement

గామి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మాస్ క దాస్ విశ్వక్ సేన్ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లకు సైన్ చేశారు. విశ్వక్ సేన్ తన12వ సినిమా కోసం దర్శకుడు రామ్ నారాయణ్‌తో చేతులు కలిపారు. #VS12 చిత్రాన్ని షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌ గత ప్రొడక్షన్ వెంచర్ భగవంత్ కేసరి మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్ సాధించి సంక్రాంతి విజేతగా నిలిచింది.

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిండచే ఈ చిత్రంలో రామ్ నారాయణ్,  విశ్వక్ సేన్‌ను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయడానికి పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. విశ్వక్ సేన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే పోస్టర్ ద్వారా సినిమా టైటిల్‌ను రివిల్ చేశారు. ఈ చిత్రానికి 'లైలా' అనే టైటిల్ పెట్టారు.  టైటిల్ పోస్టర్ కంప్లీట్ కలర్ ఫుల్ గా ఉంది.

Advertisement

పోస్టర్ ప్లజెంట్, వైలెంట్ వస్తువులతో బ్యాలెన్స్ చేయడం చాలా ఆసక్తికరంగా వుంది. ఇందులో పూలు, సీతాకోక చిలుకలు, అద్దం, కొవ్వొత్తి, మేకప్ కిట్, రేడియో, చార్మినార్, తుపాకీ, నెత్తురోడుతున్న కత్తి, మేక తల మొదలైనవి ఉన్నాయి. టైటిల్ పోస్టర్ సినిమా గురించి మరింత తెలుసుకోవాలనే క్యురియాసిటీ కలిగిస్తుంది. మోషన్ పోస్టర్‌లో పోస్టర్‌లో చూపిన అన్ని ఎలిమెంట్స్‌ను విడివిడిగా చూపించారు. యానిమేషన్ పార్ట్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి.

టైటిల్, మోషన్ పోస్టర్ సినిమాలో కథానాయికకు కూడా స్కోప్ ఉందని సూచిస్తున్నాయి. ఆమె పేరు తర్వాత తెలియజేయనున్నారు. అద్భుతమైన టెక్నికల్, ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో రూపొందనున్న ఈ సినిమాలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ మూర్తి రచయిత. తనిష్క్ బాగ్చి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, అన్వర్ అలీ ఎడిటర్. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Advertisement
Tags :
Author Image