For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Fighter Raja : 'ఫైటర్ రాజా' తప్పకుండా సినిమా పెద్ద విజయం సాధిస్తుంది : మాస్ కా దాస్ విశ్వక్ సేన్

07:26 PM Mar 28, 2024 IST | Sowmya
Updated At - 07:26 PM Mar 28, 2024 IST
fighter raja    ఫైటర్ రాజా  తప్పకుండా సినిమా పెద్ద విజయం సాధిస్తుంది   మాస్ కా దాస్ విశ్వక్ సేన్
Advertisement

పచ్చీస్ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన పాపులర్ స్టైలిస్ట్ రామ్జ్ తన రెండవ సినిమా 'ఫైటర్ రాజా'ని  కృష్ణ ప్రసాద్ వత్యం దర్శకత్వంలో చేస్తున్నారు. రన్‌వే ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.2గా దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన మేకర్స్, ఇప్పుడు టీజర్‌ను విడుదల చేశారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ టీజ‌ర్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు.

హిరో తన తండ్రి అడుగుజాడలను అనుసరిస్తూ స్క్రాప్ అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తుంటాడు. కానీ తన ఆసక్తి ఫైటింగ్ చేయడమే. అతను సినిమాల్లో ఫైటర్‌గా పనిచేస్తాడు. అతనికి అదే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. అతను వివిధ సమస్యలకు పరిష్కారాలను ఇవ్వడానికి సెటిల్మెంట్ వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. రామ్జ్  తన సొంత్ బిజినెస్ ని నిర్వహించే ఫైటర్  పాత్రలో అద్భుతంగా నటించాడు. యూనిక్ కామిక్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అతని క్యారెక్టర్ సీరియస్ గా కనిపించినా ఫన్ జనరేట్ చేసింది. అయితే, దర్శకుడు సినిమాలోని కోర్ ఎలిమెంట్‌ను ఇంకా రివిల్ చేయలేదు.

Advertisement GKSC

తనికెళ్ల భరణి, శివ నందు, రోషన్, తాగుబోతు రమేష్, సత్య ప్రకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో మాయ కృష్ణన్ కథానాయిక. శ్రీధర్ కాకిలేటి కెమెరా పనితనం, స్మరన్ సాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. హరిశంకర్, అవంతి రుయా ఎడిటర్స్ గా పని చేస్తున్నారు.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. రామ్జ్ నాకు ఈ నగరానికి ఏమయింది చిత్రం నుంచి తెలుసు. తను సెలబ్రెటీలకు చాలా చక్కని స్టయిలింగ్ చేస్తారు. మొదటి సారి నాకు షూట్ వేయించింది కూడా తనే. తను ఈ వేడుకు రమ్మని పిలవగానే నాకు అదే జ్ఞాపకం గుర్తు వచ్చింది. మనస్పూర్తిగా ఈ వేడుకకు రావాలనిపించింది. ఈ సినిమాకి సంబధించిన ప్రతిది చాలా ప్రామెసింగ్ గా వుంది. పోస్టర్ డిజైన్, కలర్ గ్రేడింగ్, విజువల్స్ అన్నీ బావున్నాయి. టీజర్ చాలా ఆసక్తికరంగా వుంది. చాలా రోజుల తర్వాత చంద్రశేఖర్ యేలేటి గారి సినిమా వైబ్ ఈ టీజర్ లో కనిపించింది. టీజర్ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా వుంది. రామ్జ్ లోని ప్రతిభ సర్ ప్రైజ్ చేసింది. తప్పకుండా అందరూ సినిమా థియేటర్స్ లో చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందనే నమ్మకం వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

Advertisement
Author Image