Manjula : నువ్వే మా సూపర్ హీరో అంటూ కృష్ణ కుమార్తె మంజుల ఎమోషనల్ పోస్ట్..!
Manjula : సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కృష్ణ ఇక లేరు అన్న మాటతో రెండు తెలుగు రాష్టాల్లోని ప్రజలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఇక ఆయనకు నివాళ్లు అర్పించేందుకు సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణ నివాసానికి భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న తెలంగాణ సీఎం కెసిఆర్, నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కృష్ణకి చివరిసారిగా నివాళు అర్పించి... కుటుంబ సభ్యులకి దైర్యం చెప్పి ఓదార్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ గవర్నర్ ‘తమిళిసై, నందమూరి బాలకృష్ణ, పలువురు సినీ ప్రముఖులు కృష్ణకి నివాళులు అర్పించారు.
కాగా తాజాగా కృష్ణ కూతురు మంజుల తన తండ్రిని స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. “నాన్న నువ్వు ప్రపంచానికే సూపర్ స్టార్ కాదు మా జీవితానికి కూడా సూపర్ స్టార్. మీరు బయట ఎలా ఉన్నపటికీ ఇంటిలో మాకోసం ఒక సాధారణ తండ్రిలా మాకు మీ ప్రేమానురాగాలు పంచడం మాకు ఎంతో గర్వకారణం. మీరు ఉన్నా లేకపోయినా మీ ప్రేమ మాకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక వెండితెరపై మీ జ్ఞాపకాలు ఎప్పటికి చెరిగిపోనివి. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను నాన్న. లవ్ యు ఎప్పటికీ” అంటూ ఎమోషనల్ అయ్యింది.
ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కాగా ప్రస్తుతం కృష్ణ భౌతికకాయాన్ని అంతిమ యాత్రగా జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి తరలిస్తున్నారు. అక్కడ కృష్ణకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంతిమ యాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొని కృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తున్నారు.