Mallareddy Health City : మైనంపల్లి చర్యలను ఖండించిన 'మల్లారెడ్డి హెల్త్ సిటీ' చైర్మన్ డాక్టర్ సి.హెచ్.భద్రారెడ్డి
విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు వద్దు - రౌడీయిజం గుండాయిజం మానుకోవాలి - దాడులు చేయడం కరెక్ట్ పద్ధతి కాదు
మల్లారెడ్డి యూనివర్సిటీ అగ్రికల్చర్ కళాశాలలో డీటైన్ వ్యవహారంలో విద్యార్థులను తప్పుదోవ పట్టించి మైనంపల్లి గారు రౌడీలను గూండాలను వెంటబెట్టుకొని కళాశాలకు వచ్చి కళాశాల సామాగ్రి ధ్వంసం చేస్తూ మల్లారెడ్డి గారి దిష్టిబొమ్మ ను దగ్దం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ డా.ప్రీతిరెడ్డి గారితో కలిసి చైర్మన్ డాక్టర్ సి.హెచ్.భద్రారెడ్డి గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సి.హెచ్.భద్రారెడ్డి గారు మాట్లాడుతూ...
కొంతమంది నాయకులు మా విద్యాసంస్థలకు పర్మిషన్లు లేనట్టు ఉన్నా అవి బిఆర్ఎస్ పార్టీ హయాంలో వచ్చినట్టు భ్రమలో బతుకుతున్నారని అలాంటి వారు వాస్తవాలు తెలుసుకోవాలి. మల్లారెడ్డి విద్యాసంస్థలు గత 32 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని ఎక్కడ ఏ చిన్న మచ్చ లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నాం. మా విద్యాసంస్థలలో దాదాపు 50 వేల మంది విద్యార్థులు, 10 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
మా విద్యాసంస్థలకు 2014 కంటే ముందే టిడిపి హయాంలో ఇంజనీరింగ్ కళాశాలలకు, కాంగ్రెస్ పాలనలో హెల్త్ సిటీలకు పర్మిషన్లు వచ్చాయని ఈ హెల్త్ సీట్ ని స్వయానా ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న విషయాన్ని అందరికి గుర్తు చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ హయాంలో రాష్ట్రంలో 5 ప్రైవేటు యూనివర్సిటీ లు మంజూరు కాగా మల్లారెడ్డి విద్యాసంస్థల అర్హతను బట్టి మాకు కూడా మల్లారెడ్డి యూనివర్సిటీ రావడం జరిగింది. మల్లారెడ్డి హాస్పిటల్ లో గత 12 ఏళ్లుగా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నాం.
మల్లారెడ్డి హాస్పిటల్ లో ప్రసవానికి వచ్చిన మహిళలకు ఫ్రీ వైద్యం అందించడమే కాకుండా వారికి CMR కిట్ లో భాగంగా పాప పుడితే రూ.5000 బాబు పుడితే రూ.2500 అందిస్తూ మా సేవలు కొనసాగిస్తున్నాం. ఇలా చేస్తున్న సేవలకు మాకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక కొంతమంది నాయకులు మాపై కక్షతో విద్యాసంస్థలలో రాజకీయాలకు తెరలేపారు. ఏ యూనివర్సిటీ గాని ఏ ఇంజనీరింగ్ కాలేజ్ గాని ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే మల్లారెడ్డి యాజమాన్యం కూడా అందులో భాగమే.
మల్లారెడ్డి యూనివర్సిటీ పరిధిలో అగ్రికల్చర్ కళాశాలలో 2000 మంది విద్యార్థుల్లో కేవలం 22 మంది విద్యార్థులు డీటైన్ అయితే వారిని అడ్డం పెట్టుకొని ఇవాళ కుట్రపూరిత రాజకీయాలకు తెలియలేపారు. విద్యార్థులకు ఏమైనా సమస్య ఉంటే వారి పక్షాన ఎవరైనా నిలబడాల్సి ఉంటే ఒక పద్ధతి ప్రకారం సమస్యను యూనివర్సిటీ అధికారులకు గాని యాజమాన్యాలకు గానీ తెలపాలి. కానీ బాధ్యతయుతమైన పెద్దమనిషి మైనంపల్లి గారు వందమంది రౌడీలని గూండాలను వెంటబెట్టుకొని కళాశాలలో ప్రవేశించి విద్యాసామాగ్రిని ద్వంసం చేసి సిబ్బందిని నానా బూతులు తిడుతూ మల్లారెడ్డి గారి దిష్టిబొమ్మను దహనం చేయడం కరెక్ట్ పద్ధతి కాదు.
వ్యక్తిగత కక్షతో రాజకీయాలు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడోద్దని నేను ఆ పెద్దమనిషికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా సమస్య ఉంటే విద్యార్థుల పక్షాన మాకు తెలియజేయండి మేము ఆ సమస్యను పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తాం అంతే తప్ప దాడులు చేస్తాం భయపెడతామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. విద్యార్థుల జీవితాలతో ఈ అంశం ముడిపడి ఉంది కాబట్టి ఈసారి కి చాలా సున్నితంగా వదిలేస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం.