'మజాకా' అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. నాన్ స్టాప్ నవ్వులు వుంటాయి : హీరో సందీప్ కిషన్
Majaka Movie : సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన, ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ 'మజాకా' హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్ రిలీజ్- ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదల
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ , జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్ . ఈరోజు, మజాకా హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.
సందీప్ కిషన్, రీతు వర్మ ఆర్కె బీచ్‌లో డ్రింక్ చేస్తూ పట్టుబడటంతో టీజర్ ప్రారంభమవుతుంది, ఇది వారి అరెస్టుకు దారితీస్తుంది. వారి మధ్య ఘర్షణ త్వరలో ప్రేమగా మారుతుంది.ఇద్దరూ ప్రేమలో పడతారు. వారి కథతో పాటు, సందీప్ తండ్రి పాత్రలో రావు రమేష్ కు కూడా ఒక ప్రేమకథ వుంది. ఇది కథనానికి మరింత వినోదాన్ని జోడించింది. తండ్రీకొడుకుల డైనమిక్ ఇందులో మెయిన్ హైలైట్. వారి కెమిస్ట్రీ నవ్వులు పంచింది.
మాస్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో త్రినాధ రావు నక్కిన మరోసారి తన మార్క్ చూపించారు,. "తమ్ముళ్ళు సీట్లు లేగుస్తాయి..." అనే లైన్‌తో దర్శకుడి సిగ్నేచర్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తుంది. సందీప్ కిషన్ తన డైనమిక్ క్యారెక్టర్ లో అదరగొట్టారు, కంప్లీట్ ఎంటర్ టైనింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తండ్రి కొడుకులుగా రావు రమేష్ సందీప్ కెమిస్ట్రీ ఈ చిత్రానికి అతిపెద్ద ఆకర్షణ.
టీజర్‌లో అద్భుతంగా కనిపించే రీతు వర్మ తన పాత్రకు ఆహ్లాదకరమైన హ్యుమర్ కూడా తెస్తుంది. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ లవ్ ఇంట్రస్ట్ గా అలరిచింది. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, లియోన్ జేమ్స్ ఎనర్జిటిక్ స్కోర్ టీజర్ ని మరింత ఎలివేట్ చేశాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. బ్రహ్మ కడలి అర్ట్ డైరెక్టర్. స్టంట్స్ ని పృథ్వి పర్యవేక్షిస్తారు.
త్రినాధ రావు నక్కినతో విజయవంతమైన ప్రాజెక్టులలో కొలబారేట్ అయిన రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, మజాకాకు కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్స్ రాద్తున్నారు. ఈ కాంబోలో ఇది మరో మెమరబుల్ ఎంటర్‌టైనర్ అవుతుందని హామీ ఇస్తుంది. టీజర్ ఇప్పటికే సంచలనం సృష్టించింది, ప్రేక్షకులల్లో క్యురియాసిటీ క్రియేట్ చేసింది. మజాకా ఫిబ్రవరి 21న గ్రాండ్ గా విడుదల కానుంది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది నా 30వ సినిమా. దీన్ని ఒక భాద్యతగా భావిస్తున్నాను. నా గత సినిమాలు భైరవకోన, రాయన్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. ఆడియన్స్ నా నుంచి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని కోరుకుంటున్నారని వారితో మాట్లాడినప్పుడు తెలిసింది. ముఫ్ఫై సినిమాలు చేయడం అంటే ప్రేక్షకులు ఇచ్చిన వరం. వారు కోరుకున్న సినిమా చేయడం నా బాధ్యత. అలాంటి సమయంలో 'మజాకా' నా దగ్గరకి వచ్చింది. 'మేము వయసుకు వచ్చాం' సినిమా చూసినప్పటినుంచి త్రినాధ్ గారితో పని చేయాలని వుండేది. ఫైనల్ గా 'మజాకా'తో కుదిరింది.
త్రినాధ్ గారు, ప్రసన్న చాలా నిజాయితీగా పని చేస్తారు. లియోన్ జేమ్స్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ ఎంజాయ్ చేస్తారు. అన్షు వెరీ స్వీట్ పర్శన్. రీతూ గారు సూపర్బ్ యాక్టర్. రావు రమేష్ గారు చేసిన ఫాదర్ క్యారెక్టర్ ఇందులో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆయన సినిమాలో మరో హీరో అనే చెప్పాలి. మా కెమిస్ట్రీ అద్భుతంగా వచ్చింది. హాస్య మూవీస్ అంటే నా హోమ్ బ్యానర్. రాజేష్ గారికి అనిల్ గారికి ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఖచ్చితంగా పోస్టర్ పై చాలా పెద్ద నెంబర్ కనిపిస్తుంది. అందరికీ థాంక్ యూ' అన్నారు.