For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Movie మహేశ్​ ఎస్​ఎస్​ఎమ్​బీ 28 రెగ్యులర్ షూటింగ్​ షూరు..

12:19 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:19 PM May 13, 2024 IST
movie మహేశ్​ ఎస్​ఎస్​ఎమ్​బీ 28 రెగ్యులర్ షూటింగ్​ షూరు
Advertisement

Movie 'సర్కారు వారి పాట' ఫిల్మ్ సక్సెస్​తో మంచి జోష్​లో ఉన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన తర్వాత సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసేసాడు. దర్శకుడు త్రివిక్రమ్​తో మూవీ చేస్తున్నట్లు తెలిసిందే. ఇటీవలే పూజాకార్యక్రమాలతో షూటింగ్​ మొదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్‌ పతాకంపై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా నేడు(సోమవారం) ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్​ షూటింగ్​ ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్​ సోషల్​మీడియా ద్వారా తెలిపింది. భారీ కెమెరాలతో హై యాక్షన్​ సీక్వెన్స్ తెరకెక్కించనున్నట్లు తెలిపింది. సినిమాకి సంగీతం అందిస్తున్న తమన్​ కూడా ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్​కు సంబంధించిన కొత్త లుక్​ను కూడా పోస్ట్​ చేశారు.

అయితే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఎంత సూపర్ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ అయ్యాయి. మాటల మాంత్రికుడు తో మహేష్ చేయనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి.

Advertisement GKSC

అయితే ఓ పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్ పాత్ర చాలా బాగుంటుందని.. మహేశ్‌ సరసన పూజాహెగ్డే సందడి చేయనునన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు ఇప్పటికే 'మహర్షి' కలిసి నటించారు.. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా కోసమే కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు.

Advertisement
Author Image