For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

రూ. 240 కోట్లతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్న రజినీకాంత్ వేట్టయన్-ద హంట‌ర్‌ మూవీ

08:48 PM Oct 14, 2024 IST | Sowmya
Updated At - 08:48 PM Oct 14, 2024 IST
రూ  240 కోట్లతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్న రజినీకాంత్ వేట్టయన్ ద హంట‌ర్‌ మూవీ
Advertisement

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. సుభాస్క‌ర‌న్ నిర్మాతగా వ్యవహరించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేసింది. గ్లోబల్ గా అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ రిలీజైన కొద్ది రోజుల్లోనే 240 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైల్ స్టోన్ అని చెప్పుకోవడమే గాక, లైకా ప్రొడ‌క్ష‌న్స్ కి మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు.

టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షక లోకాన్ని కట్టిపడేశాయి. ప్రతి షాట్ లో డైరెక్టర్ టేకింగ్ హైలైట్ అయింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహిద్ ఫాజల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుశారా విజయన్ నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ప్రతి యాక్టర్ కూడా తన ఎనర్జిటిక్ పర్ఫార్‌మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలకం అయింది.

Advertisement GKSC

లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన నిర్మాత సుభాస్కరన్ ఈ సినిమాకు వస్తున్న స్పందన పట్ల గర్వపడుతూ ప్రేక్షక లోకానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల మద్దతుతో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ తో పాటు తారాగణం మొత్తానికి గుర్తుండిపోయే చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని చెప్పుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన GKM తమిళకుమారన్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై M షెన్‌బాగమూర్తి ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. వేట్టైయన్‌ సినిమాలో గ్రిప్పింగ్ కథాంశం, వినూత్నమైన దర్శకత్వం చూశామని, సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు అదేవిధంగా విమర్శకులు కామెంట్స్ చేస్తుండటం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. న్యాయం, అధికారం, ఎన్‌కౌంటర్ హత్య, అవినీతి విద్యా వ్యవస్థ ఇతివృత్తాలను ఈ సినిమాలో ఎంతో పవర్ ఫుల్ గా చూపించారు.

వెట్టయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ₹240 కోట్లను అధిగమించడం, ఇటీవలి కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా అవతరించడం విశేషం. అన్ని వయసుల వారు ఈ సినిమాను ఆదర్శిస్తుండటం గమనార్హం.

Advertisement
Author Image