For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Love Reddy : అమోజాన్ ప్రైమ్ లో నేషనల్ వైడ్ ట్రెండింగ్ అవుతున్న 'లవ్ రెడ్డి', ఆహాలోనూ స్ట్రీమింగ్ అవుతున్న మూవీ

10:52 PM Jan 05, 2025 IST | Sowmya
UpdateAt: 10:52 PM Jan 05, 2025 IST
love reddy   అమోజాన్ ప్రైమ్ లో నేషనల్ వైడ్ ట్రెండింగ్ అవుతున్న  లవ్ రెడ్డి   ఆహాలోనూ స్ట్రీమింగ్ అవుతున్న మూవీ
Advertisement

FILM NEWS : గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "లవ్ రెడ్డి" . అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి "లవ్ రెడ్డి" చిత్రాన్ని నిర్మించారు. సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరించారు.

గతేడాది అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు అమోజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఇదే సూపర్ హిట్ టాక్ తో స్ట్రీమింగ్ అవుతోంది. "లవ్ రెడ్డి" సినిమా అమోజాన్ ప్రైమ్ లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. తమ సినిమా ప్రేక్షకులకు ప్రైమ్ వీడియో ద్వారా మరింతగా రీచ్ కావడం పట్ల మూవీ టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆహా ఓటీటీలోనూ "లవ్ రెడ్డి" సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.

Advertisement

Actors : Anjan Ramachandra, Sravani Reddy, etc

Technical team :

Music - Prince Henry
Editing - Kotagiri Venkateswara Rao
Executive Producer - Ravindra Reddy
PRO - GSK Media (Suresh - Sreenivas)
Co-Producers - Suma, Sushmita, Harish, Babu, Ravi Kiran, Zakaria
Producers- Sunanda B. Reddy, Hemalatha Reddy, Ravinder G, Madan Gopal Reddy, Nagaraj Birappa, Prabhanjan Reddy, Naveen Reddy
Written and Directed by: Smaran Reddy

Advertisement
Tags :
Author Image