For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Love, Mouli : ఉగాది సందర్భంగా విశ్వక్ సేన్ చేతుల మీదుగా 'లవ్, మౌళి' ట్రైలర్ విడుదల

11:01 PM Apr 09, 2024 IST | Sowmya
Updated At - 11:01 PM Apr 09, 2024 IST
love  mouli   ఉగాది సందర్భంగా విశ్వక్ సేన్ చేతుల మీదుగా  లవ్  మౌళి  ట్రైలర్ విడుదల
Advertisement

నవదీప్ 2.0 అని, తనని తానూ ‘లవ్, మౌళి’ ద్వారా కొత్తగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసుకుంటున్నారు . ఈ రోజు ఉగాది సందర్భంగా ఈ ‘లవ్, మౌళి’ సినిమా ట్రైలర్ యువ క‌థానాయ‌కుడు  విశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదల చేశారు.  4.15 సెకండ్స్ నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో నవదీప్ తన నటనతో అందరి ప్రశంశలు పొందారు. మౌళి క్యారక్టర్ లో లేయర్స్, విజువ‌ల్స్  అన్ని కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఈ ట్రైలర్ లాంచ్ లో చిత్ర దర్శకుడు, నటీ నటులు పాల్గొన్నారు.

చీఫ్ గెస్ట్ విశ్వక్సేన్ మాట్లాడతూ : నాకు ఎందుకో నవదీప్ తో ఒక పర్సనల్ కనెక్షన్ ఉంటుంది, నేను పదేళ్ళ క్రితం బంజారహిల్ల్స్ వచ్చినప్పుడు ఎక్కడ చూసినా, విన్నా నవదీప్ ఏ ఉండేవాడు, అలాంటి లైఫ్ ఉంటె బాగుండు అనుకున్నాను.  మనం ఏదైనా గట్టిగా అనుకుంటే అది అవుతుంది, లవ్, మౌళిలో లాగా నేను కూడా ఒక్కడినే అలా ట్రిప్స్ కి వెళ్ళిపోతాను, ముఖ్యంగా కొండ ప్రాంతాలకి, నేను ఏదైతే ఒక ప్లేస్ లో కూర్చుని, నా లైఫ్ లో ఎలా ఎదగాలి అని అనుకున్నాను, కొన్ని సంవత్సరాలకి నేను అదే ప్రదేశంలో షూటింగ్ చేశాను, నేను అనుకున్న పోసిషన్ కి రీచ్ అవుతున్నాను. నవదీప్ కి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.

Advertisement GKSC

నటీ నటులు : నవదీప్, పంఖురి గిద్వాని, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్.

సాంకేతిక నిపుణులు :
నిర్మాతలు: సి స్పేస్, నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్
దర్శకుడు: అవనీంద్ర
మ్యూజిక్ డైరెక్టర్: గోవింద్ వసంత్
బాక్గ్రౌండ్ స్కోర్: క్రిష్ణ
లిరిక్స్: అనంత శ్రీరామ్
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి
కొరియోగ్రాఫేర్: అజయ్ శివశంకర్
కాస్టుమ్ డిసైనర్: ఆన్షి గుప్త
డి ఐ: పోయిటిక్ స్టూడియోస్ (కోచ్చి)
వి ఎఫ్ ఎక్స్: నాగు
సౌండ్ డిజైన్: ధ్వని స్టూడియోస్

Advertisement
Author Image