For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Let's Celebrate Superstar Krishna's Birthday With The Divine Jai Bolo Krishna Song From Devaki Nandana Vasudeva

04:09 PM May 31, 2024 IST | Sowmya
Updated At - 04:09 PM May 31, 2024 IST
let s celebrate superstar krishna s birthday with the divine jai bolo krishna song from devaki nandana vasudeva
Advertisement

మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సెకెండ్ మూవీ 'దేవకి నందన వాసుదేవ' మేకర్స్ సెకెండ్ సింగిల్ జై బోలో కృష్ణ పాటతో ముందుకొచ్చారు. డివైన్ వైబ్స్ గల ఈ పాటని సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేశారు.

టైటిల్ సూచించినట్లు జై బోలో కృష్ణ జన్మాష్టమి స్పెషల్ సాంగ్. ఇందులో హీరో తన బ్యాచ్‌తో కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకోవడం అలరించింది. భీమ్స్ సిసిరోలియో ఎనర్జిటిక్ బీట్‌లతో ఆకట్టుకునే ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ను స్కోర్ చేశాడు. రఘురామ్ అడ్వకేట్ రాసిన లిరిక్స్ హీరో క్యారెక్టర్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాయి.

Advertisement GKSC

స్వరాగ్ కీర్తన్ సూపర్బ్ సింగింగ్ తో పాటకు ఎక్స్ట్రా ఎనర్జీని అందించాడు. యష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. అశోక్ గల్లా డ్యాన్స్ కూల్ అండ్ ఎలిగెంట్ గా వుంది. విజువల్స్ వైబ్రెంట్, గ్రాండ్ గా వున్నాయి. ఇది సినిమా ఆల్బమ్‌లోని మరో చార్ట్‌బస్టర్ సాంగ్ కానుంది.

గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్పిరిచువల్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్అందించగా, హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.

రసూల్ ఎల్లోర్‌తో పాటు ప్రసాద్ మూరెళ్ల ఈ చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో చాలా గ్రాండ్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

నటీనటులు : అశోక్ గల్లా, వారణాసి మానస

సాంకేతిక సిబ్బంది :
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
నిర్మాత: సోమినేని బాలకృష్ణ
బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్
సమర్పణ: నల్లపనేని యామిని
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో: వంశీ-శేఖర్

Advertisement
Author Image