Legend : లెజెండ్ అంటే చరిత్ర సృష్టించే వాడు.. తిరగరాసేవాడు : డైరెక్టర్ బోయపాటి శ్రీను
గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి మూడు బ్లాక్ బస్టర్స్ అందించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించిన 'లెజెండ్' వారి సెకండ్ కొలాబరేషన్ లో 2014 మార్చి 28న విడుదలై ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లెజెండ్ 10 ఇయర్స్ పురస్కరించుకుని, మేకర్స్ మార్చి 30న సెన్సేషనల్ హిట్‌ని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ లెజెండ్ బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ వేడుకలని ఘనంగా నిర్వహించారు.
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. లెజెండ్ ని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారికి అంకితం చేస్తూ ఈ సినిమాని మొదలుపెట్టాం. ఆయన ఆశీస్సులతోనే పదేళ్ళ వేడుక జరుపుకుంటున్నాం. ఆ తరానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ గారు ఆ తరానికి లెజెండ్. ఈ తరానికి సినిమా రూపంలో మేము చూపించిన లెజెండ్ బాలయ్య గారు. ఒక లెజెండరీ సినిమా మీ ముందుకు తీసుకొచ్చినందుకు దర్శకుడిగా గర్వపడుతున్నాను.
లెజెండ్ అంటే చరిత్ర సృష్టించే వాడు తిరగరాసేవాడు. ఈ సినిమా అదే చేసింది. మూడేళ్ళు ఆడి ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించింది. పదేళ్ళు గడిచినా ఈ వేడుక చూస్తుంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లా అనిపిస్తోంది. లెజెండ్ మా పై బాద్యత పెంచింది. ఆ భాద్యతతో కసితో చేసిన సినిమా అఖండ. ఇకపై మేము చేసే ఏ సినిమానైనా ఇంతే భాద్యతతో ఒక యజ్ఞంలా చేసి మీ ముందుకు తీసుకొస్తాం. బాలయ్య గారి నమ్మకమే.. సింహ లెజెండ్ అఖండ. మేము చేసే ప్రతి సినిమా ఇలానే పదేళ్ళు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పని చేసిన నటీనటులందరికీ పేరుపేరున ధన్యవాదాలు.
జగపతిబాబు గారు అద్భుతమైన పాత్ర చేశారు. చలపతి రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి. కెమరామెన్ రామ్ ప్రసాద్ గారు, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్,.. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. లెజెండ్ మార్చి 30న రీరిలీజ్ చేస్తున్నాం. అభిమానులు, ప్రేక్షకులు మళ్ళీ అదే తరహలో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇకపై మా కాంబినేషన్ లో ఇంతకంటే మంచి సినిమా చేస్తానని మాటిస్తూ... అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.