Adiparvam : ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టిన ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మీస్ 'ఆదిపర్వం'
తెలుగు - కన్నడ - హిందీ - తమిళ మలయాళ భాషల్లో "ఆదిపర్వం" ట్రైలర్ విడుదల
లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ మల్టీ లింగ్యుల్ ఫిలిం ''ఆదిపర్వం''. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది. సోమవారం ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు.
తెలంగాణ ఎఫ్.డి.సి ఛైర్మన్ ఎన్. గిరిధర్ చేతుల మీదుగా ఆదిపర్వం తెలుగు ట్రైలర్ విడుదలైంది. జడ్చర్ల ఎమ్మెల్యే జె అనిరుధ్ రెడ్డి తమిళ ట్రైలర్, ప్రముఖ దర్శకులు నీలకంఠ కన్నడ ట్రైలర్, ప్రముఖ రియల్టర్ శిల్పా ప్రతాప్ రెడ్డి మలయాళ ట్రైలర్, చిత్ర సమర్పకులు రావుల వెంకటేశ్వర్ రావు హిందీ ట్రైలర్ విడుదల చేశారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, బిల్డర్ కైపా ప్రతాప్ రెడ్డి, నటీనటులు ఢిల్లీ రాజేశ్వరి, సత్య ప్రకాష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, జెమినీ సురేష్, ఆదిత్య ఓం, శ్రీజిత ఘోష్, సీనియర్ జర్నలిస్టులు ప్రభు, ఆర్.డి.ఎస్ ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ ఎస్.ఎస్. హరీష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఘంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అతిధులంతా సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ చిత్రంలో నటీనటులు : మంచులక్ష్మీ, శివకంఠంనేని , ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ, యోగికాత్రి, గడ్డంనవీన్, ఢిల్లీరాజేశ్వరి, జెమినీ సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, అయేషా, రావుల వెంకటేశ్వర్ రావు, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు, దుగ్గిరాల వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, శిల్పప్రతాప్ రెడ్డి, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్ (జాతిరత్నాలు), మృత్యుంజయ శర్మ తదితరులు.