For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Lagadapati Sridhar : జి.వి.కె. సీనియర్స్ నేషనల్ టెన్నిస్ చాంపియన్షిప్ శ్రీధర్ సొంతం!!

03:06 PM Dec 17, 2023 IST | Sowmya
Updated At - 03:06 PM Dec 17, 2023 IST
lagadapati sridhar   జి వి కె  సీనియర్స్ నేషనల్ టెన్నిస్ చాంపియన్షిప్ శ్రీధర్ సొంతం
Advertisement

శ్రీధర్ లగడపాటి సంచలనం !! 

సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్... ఫిట్నెస్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అంతే కాదు... సినిమా తర్వాత ఆయనకు గల మరో ముఖ్య ప్యాషన్ టెన్నిస్. రెగ్యులర్ టెన్నిస్ ప్లేయర్ అయిన శ్రీధర్... తాజాగా ఈ రంగంలోనూ తనదైన ముద్రను తిరుగులేనివిధంగా చాటుకున్నారు.

Advertisement GKSC

ప్రతిష్టాత్మక జి.వి.కె. సీనియర్స్ నేషనల్ టెన్నిస్ చాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించారు బహుముఖ ప్రతిభాశాలి లగడపాటి శ్రీధర్. 55 ప్లస్ కేటగిరీలో హోరాహోరీగా ఆత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో 12 -10 సూపర్ టై బ్రేకర్ గా ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని లగడపాటి నమోదు చేశారు. గత తొమ్మిదేళ్లుగా డిఫెండింగ్ చాంపియన్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి తో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తలపడి శ్రీధర్ సాధించిన ఈ విజయం టోర్నమెంట్ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం!!

Advertisement
Author Image