For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

TELANGANA NEWS: కేటీఆర్ జన్మదిన సందర్భంగా శనివారం (24న) తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి

03:04 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:04 PM May 11, 2024 IST
telangana news  కేటీఆర్ జన్మదిన సందర్భంగా శనివారం  24న  తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి
Advertisement

కేటీఆర్ జన్మదిన సందర్భంగా శనివారం (24న) తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు ప్రకటించారు. వివిధ జిల్లాల్లో నమోదవుతున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క గంటలో నాటాలన్ననియమాన్ని సడలించినట్లు తెలిపారు. వర్షాల తెరిపి, వీలును బట్టి రోజంతా తమ తమ ప్రాంతాల్లో మొక్కలు నాటి ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు ఈ మొక్కలు నాటడాన్నే పుట్టినరోజు కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తమ పరిధిలో వీలైనన్ని మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవటం ద్వారా హరిత తెలంగాణ సాధనలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయాలన్న తమ సంకల్పానికి ప్రజలు ఇచ్చే ఈ మద్దతు చాలా విలువైనదని ఎంపీ సంతోష్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా  సర్పంచ్ లు అందరూ 2 కోట్ల 5 లక్షలు మొక్కలు, GHMC మేయర్, కార్పొరేటర్ లు కలిపి హైదరాబాద్ వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు, 142 మున్సిపాలిటీలలో చైర్మన్ లు, కౌన్సిలర్ల సహకారంతో 25 లక్షలు మొక్కలు, అన్ని కాలనీ సంఘాలు, ఇతరులు కలిసి 20 లక్షల మొక్కలు, అటవీ శాఖ పరిధిలోని ఖాళీ స్థలాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆద్వర్యంలో 50 లక్షల మొక్కలు, HMDA పరిధిలో ప్రజాప్రతినిధులతో 20 లక్షలు మొక్కలు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సమాచారం ప్రకారం మొత్తం కలిపి 3 కోట్ల 30 లక్షల మొక్కలు నాటేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయనే సమాచారం అందిందని నిర్వాహకులు తెలిపారు. మొక్కల కోసం గ్రామాల్లోని పంచాయితీ రాజ్ నర్సరీలు, అటవీ, మున్సిపల్ నర్సరీలను ఇప్పటికే అనుసంధానించామని వెల్లడించారు.

Advertisement GKSC

Advertisement
Author Image