For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

బంగారు తెలంగాణనే కొండాకు అసలైన నివాళి: లక్ష్మణ్‌ బాపూజీ 106వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌

12:46 PM Sep 27, 2021 IST | Sowmya
UpdateAt: 12:46 PM Sep 27, 2021 IST
బంగారు తెలంగాణనే కొండాకు అసలైన నివాళి  లక్ష్మణ్‌ బాపూజీ 106వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌
Advertisement

KONDA LAXMAN BAPUJI Indian Freedom Fighter 106 JAYANTHI CELEBRATIONS, CM KCR, Telangana News, Telugu World Now,

రాష్ట్రప్రభుత్వం కొండా లక్ష్మణ్‌ బాపూజీ కలలను నెరవేరుస్తూ తకువ కాలంలోనే అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపిస్తున్నదని ముఖ్యమంత్రి కే చం ద్రశేఖర్‌రావు అన్నారు. సకల జనులు, సబ్బండవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్‌ బాపూ జీ ఆశయాలను ప్రభుత్వం నెరవేరుస్తున్నదని తెలిపారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ 106వ జ యంతి (సెప్టెంబర్‌ 27)ని పురసరించుకొని ఆయనకు సీఎం ఘనంగా నివాళి అర్పించారు. బాపూజీ నిస్వార్థ సేవలను స్మరించుకొన్నారు. బంగారు తెలంగాణ సాధించడమే బాపూజీకి అసలైన నివాళి అని పేర్కొన్నారు.

Advertisement

గొప్ప ప్రజాస్వామికవాది
----------------------
సాయుధ పోరాట కాలంలో పెత్తందార్లను ఎదిరించిన చాకలి ఐలమ్మతో సహా పలువురికి న్యాయవాదిగా సేవలందించి, వారి తరఫున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది కొండా లక్ష్మణ్‌ అని సీఎం గుర్తుచేశారు. గాంధీజీ స్ఫూర్తితో దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, అవే విలువలను జీవితాంతం పాటిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో అన్ని దశల్లోనూ స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ దేశం గర్వించదగ్గ గొప్ప నేత అని కొనియాడారు. అణగారిన వర్గాల హకుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం జీవితమంతా కృషి చేశారని తెలిపారు. బహుజన నేతగా దేశవ్యాప్తంగా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్‌ బాపూజీకే దకిందని సీఎం అన్నారు.

బాపూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. స్వరాష్ట్రంలో ఉద్యాన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకున్నామని తెలిపారు. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డులను అందజేస్తూ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం వినూత్న పథకాలను అమలుచేస్తూ పద్మశాలీల అభ్యున్నతికి పాటుపడుతున్నదని పేర్కొన్నారు.

KONDA LAXMAN BAPUJI Indian freedom fighter 106 JAYANTHI CELEBRATIONS,cm kcr,telangana news,v9 news telugu,teluguworldnow.com,telugu golden tv,

Advertisement
Tags :
Author Image