KCR (Keshav Chandra Ramawat) Movie Song Launched Telangana Tejam at his Residence in Nandi Nagar by BRS chief KCR
కేసీఆర్ (కేశవ చంద్ర రమవత్) సినిమా హీరో, నిర్మాత రాకింగ్ రాకేష్ నిర్మించిన తెలంగాణ తేజం పాటను నంది నగర్ లోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు.
సంగీత దర్శకుడు చరణ్ అర్జున్,యాంకర్ జోర్ధార్ సుజాత,సింగర్ విహ,గీత రచయిత సంజయ్ మహేష్ లు , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ దీవకొండ దామొదర్ రావు, ప్రణాలిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,ఎమ్మెల్సీ,మాజీ స్పీకర్ మధుసుధన చారి ,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్,బీఆర్ఎస్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రాఘవ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారు లాంచ్ చేసిన జబర్దస్త్ రాకింగ్ రాకేశ్ 'కేసీఆర్' (కేశవ చంద్ర రమావత్ ) సినిమాలోని తెలంగాణ తేజం పాట జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్ హీరోగా తెరకెక్కిన కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ ) సినిమాలోని తెలంగాణ తేజం పాటను బీఆర్‌ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారు ఆవిష్కరించారు.
గోరేటి వెంకన్న అద్భుతంగా రచించిన ఈ పాటని చరణ్ అర్జున్ కంపోజ్ చేశారు.
'పదగతులు స్వరజతులు పల్లవించిన నేల
తేనె తీయని వీణ రాగాల తెలగాణ
ద్విపద దరువుల నేల
యక్ష జ్ఞానపు శాల
పోతనా కవి యోగి
భాగవత స్కందాల
జయ గీతికై మోగెరా
తెలగాణ జమ్మి కొమ్మై ఊగెరా
సింగిడై పొంగిందిరా తెలగాణ
తంగెడై పూసిందిరా'' అంటూ సాగిన లిరిక్స్ పవర్ ఫుల్, ఇన్స్ ప్రెషనల్ గా వున్నాయి.
సింగర్ మను, కల్పన, గోరేటి వెంకన్న కలసి అద్భుతంగా ఆలపించిన ఈ పాట అందరిలో ఉత్తేజాన్ని కలిగిస్తోంది.
పాట ఆవిష్కరణ సందర్భంగా సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, యాంకర్ జోర్ధార్ సుజాత, సింగర్ విహ,గీత రచయిత సంజయ్ మహేష్ లు , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఈ పాట గురించి రాకింగ్ రాకేష్ ను కెసిఆర్ గారు ప్రత్యేకంగా అభినందించారు.