For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Latest Film News : 'కరాటే కిడ్ : లెజెండ్స్' కొత్త ట్రైలర్ విడుదల

02:24 PM Apr 02, 2025 IST | Sowmya
Updated At - 04:13 PM Apr 02, 2025 IST
latest film news    కరాటే కిడ్   లెజెండ్స్  కొత్త ట్రైలర్ విడుదల
Advertisement

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందినb ఫ్రాంచైజీలలో ఒకటైన కరాటే కిడ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొత్త భాగం కరాటే కిడ్‌: లెజెండ్స్ కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం 2025 మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

కరాటే కిడ్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు లేని విధంగా, ఈ ఆరవ భాగంలో రెండు ఐకానిక్‌ పాత్రలు — జాకీ చాన్ (Mr. Han) మరియు రాల్ఫ్ మాకియో (Daniel LaRusso) కలిసి తొలిసారి స్క్రీన్‌పై కనిపించనున్నారు. ట్రైలర్‌లో ఆ పాత్ర కు వారు కష్టపడిన విధానం, వారి శిక్షణ, మిస్టర్ మియాగీ లెగసీకి ఘన నివాళిని కూడా అందించడం మీరు ఈ ట్రైలర్‌లో చూశారు.

Advertisement GKSC

ఈ కథ లీ ఫాంగ్ (బెన్ వాంగ్) అనే కుంగ్‌ ఫూ ప్రతిభావంతుడిని కేంద్రంగా సాగుతుంది. అతడు తన తల్లితో కలిసి న్యూయార్క్‌ నగరానికి వచ్చి ఓ ప్రసిద్ధ పాఠశాలలో చేరతాడు. అక్కడ ఒక విద్యార్థిని, ఆమె తండ్రితో స్నేహం ఏర్పడుతుంది. అయితే ఒక లోకల్‌ కరాటే చాంపియన్‌తో గొడవలు మొదలవ్వడం అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తరువాత జరిగిందేమిటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

తనను తానే రక్షించుకోవాలనే ఉద్దేశంతో, లీ ఫాంగ్‌ కుంగ్‌ ఫూ గురువు మిస్టర్ హాన్ మరియు లెజెండరీ కరాటే కిడ్ డేనియల్ లారూసోల నుంచి శిక్షణ తీసుకుంటాడు. ఇద్దరి శైలి మిళితంతో అతడు ఓ అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్‌ పోరుకు సిద్ధమవుతాడు. ఈ ఏపిసోడ్‌ అందర్ని ఎంతో అలరించే విధంగా ఉంటుంది.

జొనథన్ ఎన్‌ట్‌విసిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాకీ చాన్, రాల్ఫ్ మాకియో, బెన్ వాంగ్, జోషువా జాక్సన్, సేడీ స్టాన్లీ, మరియు మింగ్-నా వెన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

కరాటే కిడ్‌: లెజెండ్స్ అనేది శక్తివంతమైన యాక్షన్‌తో పాటు భావోద్వేగాలు, సాంప్రదాయ విలువలు మరియు లెగసీకి గౌరవం తెలియజేసే విభిన్నమైన సినిమా అనుభవాన్ని అందించనుంది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. — పాత తరం అభిమానులు మరియు కొత్త తరం ప్రేక్షకులందరిని ఈ సినిమా అలరిస్తుందనడంతో ఎటువంటి సందేహం లేదు.

Advertisement
Author Image