For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Arjun S/O Vyjayanthi : అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పెర్ఫామ్ చేశారు : లేడి సూపర్ స్టార్ విజయశాంతి

10:29 PM Apr 09, 2025 IST | Sowmya
Updated At - 10:29 PM Apr 09, 2025 IST
arjun s o vyjayanthi   అర్జున్ s o వైజయంతి లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పెర్ఫామ్ చేశారు   లేడి సూపర్ స్టార్ విజయశాంతి
Advertisement

FILM NEWS : నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తుంది. తల్లీ కొడుకుల అనుబంధం సినిమా ప్రధానాంశం. ఈరోజు, చిత్తూరులో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో  సినిమా సెకండ్ సింగిల్- ముచ్చటగా బంధాలే  సాంగ్ ని లాంచ్ చేశారు.

స్టార్ కంపోజర్ బి అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన ముచ్చటగా బంధాలే, కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీ కొడుకుల భావోద్వేగ అనుబంధంను సున్నితంగా చిత్రీకరించిన మేలోడిక్ మాస్టర్ పీస్. రఘు రామ్ సాహిత్యంతో కూడిన ఈ పాట తల్లి  స్వభావాన్ని హైలైట్ చేస్తుంది, ఆమె తన కొడుకు విజయం సాధించాలనే కలలను సాకారం చేసుకుంటూ, అతనికి నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అదే సమయంలో, కొడుకు తన తల్లిని సంతోషంగా, గర్వంగా ఉంచేందుకు ఎంతో ప్రయత్నిస్తాడు. తల్లి-కొడుకుల బంధంతో పాటు, ఈ పాట కళ్యాణ్ రామ్ ప్రేమ వైపు ఒక గ్లింప్స్ అందిస్తుంది,  సాయి మంజ్రేకర్‌తో అతని సున్నితమైన రిలేషన్ ని పాటకు అదనపు ఎమోషన్ ని జోడిస్తుంది.

Advertisement GKSC

హరిచరణ్ సోల్ ఫుల్ వాయిస్ ఈ పాట ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేసింది,మొత్తంమీద, ముచ్చటగా బంధాలే తల్లి-కొడుకుల బంధానికి హృదయపూర్వక నివాళి.ఈ చిత్రానికి సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ప్రముఖ పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ రామ్ ప్రసాద్, ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్ విస్సా. ఇప్పటికే హ్యుజ్ సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ.. సినిమాలో పని చేసిన అందరికీ అభినందనలు. కళ్యాణ్ రామ్ బాబు తల్లి గురించి ఎంత అద్భుతంగా చెప్పాడు. తను విలువలు ఉన్న మనిషి, క్రమశిక్షణ గల మనిషి. ఎన్టీ రామారావు గారి మనవడు. ఆ క్రమశిక్షణ ఎక్కడికి పోతుంది. ఈ సినిమాని చాలా అద్భుతంగా చేశాడు. 18వ తారీఖున మీరంతా చూస్తారు. మీరంతా మెచ్చుకుంటారు. అంత అద్భుతంగా చేసాడు. ఈ కాలేజీలో ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన స్టూడెంట్స్ అందరికీ థాంక్యూ. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. నిజాయితీ పని చేసాం. ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేయవలసిందిగా మీ అందరిని కోరుకుంటున్నాను. థాంక్యూ'అన్నారు.

నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీవీరాజ్

సాంకేతిక సిబ్బంది :
రచన, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ: రామ్ ప్రసాద్
బ్యానర్లు: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
ఎడిటర్: తమ్మిరాజు
సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
యాక్షన్: రామకృష్ణ, పీటర్ హెయిన్
పీఆర్వో: వంశీ-శేఖర్, వంశీ కాకా
మార్కెటింగ్: ఫస్ట్ షో

Advertisement
Author Image