For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'ఛాంపియన్‌' ముహూర్తం షాట్‌కు క్లాప్ ఇచ్చిన విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్

08:48 PM Aug 17, 2024 IST | Sowmya
Updated At - 08:48 PM Aug 17, 2024 IST
 ఛాంపియన్‌  ముహూర్తం షాట్‌కు క్లాప్ ఇచ్చిన విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్
Advertisement

యంగ్ హీరో రోషన్, స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్‌ల బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించనున్న పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ 'ఛాంపియన్' కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతంతో చేతులు కలిపారు. ఇప్పటికే ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

కల్కి 2898 AD ఎపిక్ బ్లాక్‌బస్టర్‌ను అందించిన విజనరీ నాగ్ అశ్విన్ ఫస్ట్ షాట్‌కు క్లాప్‌ ఇచ్చారు. రోషన్‌ని కొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు ప్రదీప్ అద్వైతం యూనిక్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. సినిమాలో డైనమిక్ రోల్ పోషిస్తున్న రోషన్ సినిమా కోసం కంప్లీట్ మేకోవర్‌ అయ్యారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చరిస్మాటిక్ గా కనిపించారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తోట తరణి ఆర్ట్ డైరెక్టర్. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.

Advertisement GKSC

Cast : Roshann

Technical Crew :

Production Banners: Swapna Cinema, Anandi Art Creations, Concept Films
Director: Pradeep Advaitham
DOP: R Madie
Art Director: Thota Tharani
PRO: Vamsi-Shekar

Advertisement
Author Image