KAIZER : ఆటో డ్రైవర్ల బతుకులు మార్చే చిత్రం 'కైజర్' : డైరెక్టర్ వికాస్
సహచారి క్రియేషన్స్ బ్యానర్‌పై రోహన్ కులకర్ణి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ చిత్రం కైజర్. యంగ్ డైరెక్టర్ వికాస్ చిక్బల్లాపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ డిస్ట్రీబ్యూటర్ లో ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్, ఎమ్ఎక్స్ ప్లేయర్లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆటో డ్రైవర్ల కష్టాలు ఎలా ఉంటాయి, వారిని ఆదుకోవడానికి రోహాన్ కులకర్ణి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. రోకు యాప్ ఆటో డ్రైవర్లకు ఎలా ఉపయోగపడుతుందో ఈ సినిమాలో అద్భుతంగా చూపించినట్లు డైరెక్టర్ వికాస్ చిక్బల్లాపూర్ వివరించారు.
డైరెక్టర్ వికాస్ ఇంకా మాట్లాడుతూ.. ఈ కథను ప్రతీ ఆటో డ్రైవర్‌కు చేరవేయాలని దానికి మీడియా సపోర్ట్ కావాలి అన్నారు. కైజర్ చిత్రం రోహన్ కులకర్ణి రియల్ స్టోరీ అని పేర్కొన్నారు. రోకు కాన్సెప్ట్ పైనా సినిమా తీయాలి అనే ఆలోచన వచ్చిన వెంటనే కథను సిద్దం చేసుకోవడం, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా అన్ని పనులు చాలా తొందరగా అయిపోయాయి అని డైరెక్టర్ తెలిపారు. సినిమాలో చాలా మంది రియల్ ఆటో డ్రైవర్లను చూపించాము అని తెలిపారు. డైలాగ్స్ రైటర్ ఫనీకి, సీనియర్ యాక్టర్లు కోటేశ్వరరావు, ప్రసాద్, హీరో రవి మహదాస్యమ్ ఈ సినిమాకు పనిచేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఇక సినిమాలో సృజన గోపాల్ కేవలం స్టోరీ, స్క్రీన్ ప్లే నే కాదు అన్ని పనులు తనదే అన్నట్లు చాలా యాక్టీవ్ గా చేశారు అని వెల్లడించారు. ఇక ఈ సిరీస్ ను జనాల వద్దకు నేను తీసుకెళ్తా అని ముందుకొచ్చిన ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ అధినేత రాజీవ్ కు ధన్యవాదాలు తెలిపారు.
నటీనటులు : రవి మహదేవస్యం, సుశాంత్ యష్కీ, కోటేశ్వరరావు, బీహెచ్ఎల్ ప్రసాద్ తదితరులు
బ్యానర్: సహచారి క్రియేషన్స్
డైరెక్టర్ : వికాస్ చిక్బల్లాపూర్
నిర్మాత: సహచారి క్రియేషన్స్
కథ, స్క్రీన్ ప్లే: సృజన గోపాల్
డీఓపీ అండ్ ఎడిటింగ్: వికాస్ చిక్బల్లాపూర్
మ్యూజిక్: పవన్
ఆర్ట్: హర్ష
డైలాగ్స్: వావిలాల ఫినీ శ్రీకాంత్
పీఆర్ఓ: హరీష్, దినేష్