For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

తెలంగాణలో కక్ష పూరిత రాజకీయాలు ప్రారంభించారు : జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

12:50 PM Jun 23, 2024 IST | Sowmya
Updated At - 12:50 PM Jun 23, 2024 IST
తెలంగాణలో కక్ష పూరిత రాజకీయాలు ప్రారంభించారు   జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
Advertisement

కక్ష పూరిత రాజకీయాలు తెలంగాణలో ప్రారంభించారని జనగాం ఎమ్మెల్యే, BRS నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇప్పటిదాకా ఇలాంటి వాతావరణo తెలంగాణలో లేదు అన్నారు. BRS పార్టీ వీడే ప్రసక్తే లేదు అన్నారు జనగాం ఎమ్మెల్యే, BRS నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అన్నారు. ఉద్యమం నుంచి రాజకీయాలలోకి వచ్చాను. ఉద్యమంలో అరెస్ట్ అయ్యాను.. నేను పార్టీ మారను అని ప్రకటించారు. అమెరికాలోని వర్జీనియా లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం లో ఎమ్మెల్యే పల్లా పాల్గొన్నారు. రాజకీయాల్లో విలువలు పాటించాలి.. గెలిచిన పార్టీలో ఐదేళ్లు ఉండాలి అన్నారు. పార్టీ మారాలి అని నాపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నారు.

ఆరు నెలల్లో నాలుగైదు కేసులు నమోదయ్యాయి. విచారణ పేరుతో కమిటీలు వేశారు. నాతోపాటు బార్య నీలిమ, కొడుకు అనురాగ్ పై కూడా కేసులు పెట్టారు. వాటికి భయపడను. ఎదుర్కొంటూ పోరాడత. Brs లోకి రాక ముందు జేఏసీ తో కలిసి తెలంగాణ కోసం పనిచేశా, అప్పుడు కేసులు నమోదయ్యాయి.. మళ్లీ ఇప్పుడు పెడుతున్నారు. నాకు కేసులు కొత్త కాదు అన్నారు పల్లా. కాళేశ్వరం అద్భుత ప్రాజెక్ట్. నిపుణుల సలహాతో అక్కడ కట్టారు. అవగాహన లేమితో కొందరు మాట్లాడుతున్నారు. అనేక రిజర్వాయర్ లలో కాళేశ్వరం ఒకటి. అనేక మంది కాంట్రాక్ట ర్లు ప్రాజెక్టులో నిమగ్నం అయ్యారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది.. ఈ విషయం ప్రజలకు అర్థం అవుతుంది ఇప్పుడిప్పుడే అన్నారు. కెసిఆర్ కి శ్వాస, ధ్యాస తెలంగాణే అన్నారు పల్లా. తెలంగాణ తలెత్తుకొని నిలబడేలా కెసిఆర్ చేశారు అన్నారు.

Advertisement GKSC

ఇక్కడి యూనివర్సిటీల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉందన్నారు. మౌలిక సదుపాయాలు, పరిశోదన లాంటి అంశాల్లో ఆదర్శం అన్నారు. మన స్టూడెంట్స్ స్ట్రాంగ్… అందుకే 30 శాతం మంది ఇండియా వాళ్ళే ఉంటారు. అందులోనూ తెలుగు వాళ్ళే ఉంటారు. ఇటు విద్యా.. అటు ఉద్యోగం విషయాల్లో మన వాళ్ళ పైనే విదేశీ యూనివర్సిటీలు ఆధార పడుతున్నాయి. ఇది మనందరికీ గర్వకారణం అన్నారు. ఆటా ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఆటా గత ప్రెసిడెంట్ లు భువనే శ్ భుజాల, రామ్మోహన్ కొండ, gta చైర్మన్ కలవల విశ్వేశ్వర రెడ్డి , రవి పల్లా, స్థానిక తెలుగు సంఘాలు మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొన్నారు.

Advertisement
Author Image