జమున గారి మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
01:23 PM Jan 27, 2023 IST | Sowmya
Updated At - 01:23 PM Jan 27, 2023 IST
Advertisement
ప్రముఖ సీనియర్ నటి జమున మృతికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ నటీమణి జమున మృతిచెందడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని తనను తీవ్రంగా కలిచి వేసిందని ఆయన అన్నారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి తెలుగు వారి స్థాయిని పెంచేందుకు కృషి చేశారని ఆయన అన్నారు.
జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Advertisement