For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవితకాలం అధ్యక్షులుగా శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

03:49 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:49 PM May 11, 2024 IST
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవితకాలం అధ్యక్షులుగా శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
Advertisement

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవితకాల జాతీయ అధ్యక్షులుగా శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఎన్నికయ్యారు. ప్లీనరీ రెండోరోజు ఈ విషయాన్ని పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి లక్షలాది మంది పార్టీ కార్యకర్తల ఆమోదం, కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. ప్లీనరీ మొదటి రోజు(జులై 8, 2022న) నిర్వహించిన పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి తరఫున 22 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇతరులెవరూ నామినేషన్లు వేయలేదు. దాంతో పార్టీ జీవితకాల జాతీయ అధ్యక్షులుగా శ్రీ జగన్ మోహన్ రెడ్డిగారు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పార్టీ నాయకులంతా జగన్ గారిని కలిసి అభినందనలతో ముంచెత్తారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా...
అదేవిధంగా పార్టీ రాజ్యాంగం సవరణల ప్రతిపాదనలకు కూడా ప్లీనరీ ఆమోదం తెలియజేసింది. మొదటిది, ఆర్టికల్ -1 ప్రకారం... యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా లేదా వైఎస్ఆర్సీపీగా గుర్తించవచ్చు అన్న సవరణకు ఆమోదం తెలిపారు. అలానే, ఆర్టికల్ 8, 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం, పార్టీ అధ్యక్షులు జీవితకాలం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతారని చేసిన సవరణకు ఆమోదం తెలియజేశారు.

Advertisement GKSC

10 తీర్మానాలకు ఆమోదం...
రెండు రోజులపాటు జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో మొత్తం పది తీర్మానాలకు ఆమోదం తెలిపారు. తొలిరోజు ప్లీన‌రీ సమావేశంలో మ‌హిళా సాధికార‌త‌- దిశ చ‌ట్టం, విద్యా రంగం, న‌వ‌ర‌త్నాలు- డీబీటీ, వైద్యారోగ్యంపై తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. రెండోరోజు పరిపాలనా వికేంద్రీకరణ- పారదర్శకత, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు-ప్రోత్సాహకాలు, ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం, పార్టీ రాజ్యాంగ సవరణ.. తీర్మానాలపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదించారు.Jagan Mohan Reddy elected lifetime President of YSRCP,ysrcp plenary meeting,AP Political News,CM JAGAN,telugu golden tv,my mix entertainements,v9 news telugu,www.teluguworldnow.com,1

Advertisement
Author Image