For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: "ఇట్లు అమ్మ" చిత్రం "నా కెరీర్ బెస్ట్" అంటున్న రేవతి !!

04:32 PM Dec 11, 2021 IST | Sowmya
Updated At - 04:32 PM Dec 11, 2021 IST
film news   ఇట్లు అమ్మ  చిత్రం  నా కెరీర్ బెస్ట్  అంటున్న రేవతి
Advertisement

అంకురం ఫేమ్ సి.ఉమామహేశ్వరావు దర్శకత్వంలో సుప్రసిద్ధ నటి రేవతి టైటిల్ పాత్రలో ప్రముఖ వ్యాపారవేత్త డా: బొమ్మకు మురళి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన "ఇట్లు అమ్మ" చిత్రానికి అసాధారణ స్పందన లభిస్తోంది. అవార్డులు కూడా వెల్లువెత్తుతున్నాయి. సోని లివ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

చిత్ర నిర్మాత-బొమ్మకు క్రియేషన్స్ అధినేత డా: బొమ్మకు మురళి మాట్లాడుతూ..."రేవతి గారి నటన, ఉమామహేశ్వరావు దర్శకత్వ ప్రతిభ, మధు అంబట్ ఛాయాగ్రహణం, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, సన్నీ ఎమ్.ఆర్ సంగీతం, గోరేటి వెంకన్న గానం-సాహిత్యం, సుచిత్ర చంద్రబోస్ కొరియోగ్రఫీ తదితర అంశాలు "ఇట్లు అమ్మ" చిత్రం ఓ దృశ్యకావ్యంగా తీర్చిదిద్దాయి. సోని లివ్ లో ప్రసారమవుతున్న "ఇట్లు అమ్మ" చిత్రాన్ని ఓటిటి ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. ఇప్పటికి 47 అవార్డులు వరించాయి. మరిన్ని అవార్డులు వస్తాయనే నమ్మకముంది. ఈ చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇంత గొప్ప చిత్రం మా "బొమ్మకు క్రియేషన్స్"లో నిర్మాణం కావడం మాకెంతో గర్వకారణం. రేవతి గారు "ఇట్లు అమ్మ" చిత్రం తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పడం బట్టి ఈ చిత్రాన్ని అంచనా వేయవచ్చు. ఈ చిత్రానికి అవార్డులతోపాటు రివార్డులు కూడా మా అంచనాలను మించి వస్తున్నాయి. ఈ చిత్ర నటీనటులు-సాంకేతిక నిపుణులు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు" అన్నారు.

Advertisement GKSC

పోసాని కృష్ణమురళి, రవి కాలె, ప్రశాంత్, మిహిర, వినీత్, అరువి బాల ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సౌండ్ ఇంజినీర్: ఏ.ఎస్.లక్ష్మినారాయణ, సంగీతం: సన్నీ ఎమ్.ఆర్, సాహిత్యం: గోరేటి వెంకన్న-ఇండస్ మార్టిన్, గానం: గోరేటి వెంకన్న-మంగ్లీ-రోల్డ్రాయిడ్-రాము, నృత్యాలు; సుచిత్ర చంద్రబోస్, కూర్పు: ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం: మధు అంబట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కనకదుర్గ, నిర్మాత: డా: బొమ్మకు మురళి, దర్శకత్వం: సి.ఉమామహేశ్వరరావు, నిర్మాణం: బొమ్మకు క్రియేషన్స్!!

Itlu Amma Movie Streaming in SONYlive Best Movie in My Career Says Sr Actress Revathi,Ankuram Fame C Umamaheswara Rao,Bommaku Creations,Bommaku Murali,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com

Advertisement
Author Image