అవసరం వచ్చినపుడు బఫూన్ల భరతం పడతాం: మంత్రి కేటీఆర్.
ఒకడు ఎగిరెగిరి ఏమై పోయాడో తెలుసు... అవసరం వచ్చినపుడు బఫూన్ల భరతం పడతాం: మంత్రి కేటీఆర్
ఏప్రిల్ 27 వస్తే టీ ఆర్ ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు అవుతుంది.
కెసిఆర్ కు 1995 లో నలభై యేండ్ల వయసు,
అది రాజకీయంగా టేక్ ఆఫ్ అయ్యే వయసు.
చంద్రబాబు ఒక వైవు ,చరిత్ర ఉన్న కాంగ్రెస్ మరో వైపు,
తెలంగాణ కోసం విఫలమైన పోరాటాలు ఇంకో దిక్కు.
తెలంగాణ అంశమే తెరమరుగైన పరిస్థితులు అపుడు
కెసిఆర్ అపుడు చంద్రశేఖర్ రావు మాత్రమే ..ఒక మెదక్ జిల్లాకు మాత్రమే తెలుసు
మీడియా ,మనీ ,మజిల్ పవర్ కెసిఆర్ కు అపుడేమి లేదు.
ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో కెసిఆర్ ఒక్కడిగా ఇరవై యేండ్ల క్రితం టీ ఆర్ ఎస్ స్థాపించారు.
ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు తన పదవులను గడ్డిపోచలా త్యాగం చేసి ..లక్ష్యం నుంచి తప్పుకుంటే రాళ్ళ తో కొట్టి చంపండి అని అన్న దమ్మున్న నేత కెసిఆర్.
తెలంగాణ ను గేళీ చేసిన పరిస్థితుల్లో కెసిఆర్ ఒక్కడిగా ప్రయాణం ప్రారంభించారు.
నిరాశ కల్పించినా కెసిఆర్ కుంగిపోకుండా తెలంగాణ సాధించారు,
అలాంటి కెసిఆర్ ను గౌరవం లేకుండా కొందరు మాటాడుతున్నారు.
సీఎం లను ఉరికించిన చరిత్ర టీ ఆర్ ఎస్ ది.
మా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు
గోడకు వేలాడ దీసే తుపాకీ మౌనం గా ఉంటుంది ..టైం వచ్చినపుడు తుపాకీ విలువ తెలుస్తుంది.
విద్యార్థులు ఉస్మానియా ,కాకతీయ యూనివర్సిటీ ల్లో చదువుకుంటే బీజేపీ నేతలు వాట్సాప్ యూనివర్సిటీ లో అబద్దాలు నేర్చుకుంటున్నారు వ్యాప్తి చేస్తున్నారు.
కెసిఆర్ మౌనాన్ని ఎవ్వరూ తక్కువ అంచనా వేయొద్దు
అవసరం వచ్చినపుడు బఫూన్ల భరతం పడతాం.
విద్యా ,ఉద్యోగ అవకాశాలు తెలంగాణ వచ్చిన తర్వాత భారీ గా పెంచిన ఘనత కెసిఆర్ దే,
గురుకుల పాఠశాలలు ,కాలేజీలను తెలంగాణ లో వందల శాతం పెంచుకున్నాం
ఇవన్నీ తెలియకుండా కొందరు సన్నాసులు మాట్లాడుతున్నారు.
తెలంగాణ లో టీ ఆర్ ఎస్ ఇవన్నీ చేస్తే కేంద్రం లో ఉన్న బీజేపీ విద్యాపరంగా చేసింది గుండు సున్న.
కొత్త ఐఐఎం ,ఐ ఎస్ ఆర్ ఐ ఐ టీ ట్రిపుల్ ఐటీ సంస్థలను దేశమంతా ప్రకటించిన బీజేపీ తెలంగాణ కు ఇచ్చింది గుండుసున్నా.
నవోదయా విద్యాలయాలు కూడా తెలంగాణ కు దక్కలేదు.
కొత్త మెడికల్ కాలేజీల్లో తెలంగాణ కు దక్కింది మొండి చేయి,
ఇన్ని మొండి చేతులు చూపిన బీజేపీ కి తెలంగాణ లో ఎందుకు ఓటేయాలి ?
విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ మూసేస్తుంటే ఇక బయ్యారం లో బీజేపీ ఉక్కు ఫ్యాక్టరీ కడుతుందా ?
ఇలాంటి వాటి గురించి మాట్లాడకుండా బీజేపీ మాటకు ఇండియా పాకిస్థాన్ అంటుంది,
ఏమైనా అంటే దేశం కోసం ధర్మం కోసం అంటారు.
బీజేపీ నేతలకు తెలంగాణ దేశం లో భాగం గా ఉందని కనిపించడం లేదా ?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు ద్వారా యువత సమాధానం చెప్పాలి.
అడ్వకేట్ లు ,జర్నలిస్టుల కు సంక్షేమ నిధి కేటాయించాము.
మేము గణాంకాలతో అభివృద్ధి గురించి చెబితే బీజేపీ మాటలు చెబుతోంది.
మేము ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడితే మోడీ పకోడీ ల గురించి మాట్లాడుతారు
పకోడీలు అమ్ముకుంటే కూడా అది కూడా తన ఘనతే అని మోడీ చెప్పుకుంటరు.
టీ ఆర్ ఎస్ మీటింగ్ లో బఠాణీలు అమ్ముకునే వారుంటారు ..అది మా ఘనత గా చెప్పుకోవాలా ?
మోడీ మాటలు కొట్లల్లో ఉంటాయి ..చేతలు పకోడీ ల్లా ఉంటాయి (బాత్ కరోడోమే -కామ్ పకోడీమే ).
మోడీ 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ ప్యాకేజి అన్నారు ..ఒక్కరికైనా ఏమైనా వచ్చిందా ?
దూషణలు చేస్తున్న వారికి మిత్తి తో సహా బదులిస్తాం.
ఒకడు ఎగిరెగిరి ఏమై పోయాడో తెలుసు.
అందరీ చిట్టాలు మా దగ్గర ఉన్నాయి ..
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీ ఆర్ ఎస్ గెలవాలి
మనం చేసినవి చెప్పి ఓట్లడగాలి.