For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'డార్లింగ్' ట్రైలర్ తో అందరినీ ఇంప్రెస్ చేస్తున్న నభా నటేష్

09:01 PM Jul 08, 2024 IST | Sowmya
Updated At - 09:01 PM Jul 08, 2024 IST
 డార్లింగ్  ట్రైలర్ తో అందరినీ ఇంప్రెస్ చేస్తున్న నభా నటేష్
Advertisement

గ్లామర్ తో పాటు పర్ ఫార్మెన్స్ తో మెప్పించగల హీరోయిన్ నభా నటేష్. ఆమె తన మొదటి సినిమా నుంచే అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇండస్ట్రీలోనూ నభా అట్రాక్టివ్ లుక్స్ తో పాటు మంచి పర్ ఫార్మర్ అనే పేరు తెచ్చుకుంది. ఆమె లేటేస్ట్ మూవీ డార్లింగ్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. ఈ ట్రైలర్ లో స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న అమ్మాయిగా నభా నటేష్ చూపిన నటన అందరి ప్రశంసలు అందుకుంటోంది.

ప్రియదర్శితో కలిసి నభా నటేష్ లీడ్ రోల్ లో నటించిన డార్లింగ్ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించారు. డార్లింగ్ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా వచ్చిన హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ అశ్విన్ రామ్ డార్లింగ్ సినిమా పట్ల నభా చూపించిన డెడికేషన్ ను అప్రిషియేట్ చేశారు. రెండేళ్ల కిందట యాక్సిడెంట్ కు గురైన నభా ఆ ప్రమాదం నుంచి తేరుకుని మళ్లీ స్క్రీన్ మీద అంతే ఎనర్జిటిక్ గా కనిపించడం అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.

Advertisement GKSC

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ... ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది కుంగిపోయిన భావనకు గురవుతారు. కానీ నభా ఆ ప్రమాదం నుంచి తేరుకున్న తీరు ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. నటిగా ఆమెకున్న పట్టుదల, అంకితభావం చాలా గొప్పవి. అన్నారు.

దర్శకుడు అశ్విన్ రామ్ స్పందిస్తూ... డార్లింగ్ స్క్రిప్ట్ ను కొందరు హీరోయిన్స్ కు చెప్పినప్పుడు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ క్యారెక్టర్ చేసేందుకు భయపడ్డారు. కమల్ హాసన్, విక్రమ్ లాంటి వాళ్లు ఇలాంటి పాత్రలతో మెప్పించారనేది వారి భయం. కానీ నభాకు స్టోరీ చెప్పినప్పుడు ఇంతేనా.. చేస్తాను అని చెప్పింది. నటిగా తనకున్న కాన్ఫిడెన్స్ ను ఈ సందర్భం చూపిస్తుంది. ఆమె మా కథను నమ్మి వర్క్ షాప్స్ లో పాల్గొన్నారు. అన్నారు.

నభా నటేష్ మాట్లాడుతూ... ప్రమాదం జరిగిన తర్వాత ఎలాంటి మూవీ చేయాలని ఆలోచిస్తున్న టైమ్ లో డార్లింగ్ ఆఫర్ నా దగ్గరకు వచ్చింది. ఇలాంటి పాత్రలో నటించాలనేది నా డ్రీమ్. అని చెప్పింది.

Advertisement
Author Image