For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'8 వసంతాలు' నుంచి శుద్ధి అయోధ్యగా అనంతిక సనీల్‌కుమార్‌

03:52 PM Jun 07, 2024 IST | Sowmya
Updated At - 03:52 PM Jun 07, 2024 IST
 8 వసంతాలు  నుంచి శుద్ధి అయోధ్యగా అనంతిక సనీల్‌కుమార్‌
Advertisement

మోస్ట్ సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ స్టార్లతో హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను నిర్మించడమే కాకుండా కంటెంట్-రిచ్ మూవీలను రూపొందిస్తోంది. గోవా, ఖాట్మండు మోఫిల్మ్ ఫెస్టివల్స్ లో రెండుసార్లు ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుని విమర్శకుల ప్రశంసలు పొంది 'మను'తో దర్శకుడిగా డెబ్యు చేసి దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో కాన్సెప్ట్ బేస్డ్ మూవీ '8 వసంతాలు'ను నిర్మిస్తున్నారు.

MAD ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ హీరోయన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె పాత్రను శుద్ధి అయోధ్యగా పరిచయం చేశారు మేకర్స్. చెమ్మగిల్లిన కళ్లతో కదులుతున్న కవితలా, నవ్వుతూ కనిపించారు. కళ్లకు మాస్కరా, చెవిపోగులు, నోస్ రింగ్ ఆమెను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేశాయి. ఆమె సెన్సిబుల్ డాటర్, మంచి స్నేహితురాలు, అన్ కండీషనల్ లవర్, ఇంటెన్స్ మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్, ఇన్స్పైరింగ్ రైటర్, గ్రేస్ ఫుల్ హ్యూమన్ బీయింగ్. శుద్ధి అయోధ్య 19 ఏళ్ల నుండి 27 ఏళ్ల యువతి వరకు 8 సంవత్సరాల వ్యవధిలో విభిన్నమైన వ్యక్తులు, భావోద్వేగాలు, ప్రదేశాలను ఎక్స్ ప్లోర్ చేయడంలో8 వసంతాల ట్రాన్స్ ఫర్మేషన్ జర్నీని ప్రజెంట్ చేస్తోంది.

Advertisement GKSC

ఆమె వ్యక్తిత్వం ఆమె పేరు శుద్ధిని ప్రతిబింబిస్తుంది, ఆమె జీవితంలోని ప్రతి అంశంలో 'స్వచ్ఛత' గా వుంటుంది. ఆమె మాటలు, ఆలోచనలు, పనులు,  దయ, డిగ్నిటీ ని ప్రజెంట్ చేస్తాయి. ఒక లైన్ లో చెప్పాలంటే  SHE IS POETRY IN MOTION. ఆకట్టుకునే కోట్స్‌తో పాటు పోస్టర్‌లతో దర్శకుడు తన పొయిటిక్ సైడ్ ని చూపించాడు. టైటిల్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తూ అనంతిక ఫస్ట్-లుక్ పోస్టర్ 8 వసంతాల వరల్డ్ చూడాలని కోరుకునేలా చేస్తుంది.

నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వనాథ్ రెడ్డి డీవోపీ కాగా, నరేష్ కుమారన్ సంగీతం అందిస్తున్నారు. అరవింద్ ములే ప్రొడక్షన్ డిజైనర్ కాగా, శశాంక్ మాలి ఎడిటర్. బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

తారాగణం : అనంతిక సనీల్‌కుమార్

సాంకేతిక సిబ్బంది :
రచన, దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సీఈవో: చెర్రీ
సంగీతం: నరేష్ కుమారన్
డీఓపీ: విశ్వనాథ్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్
ఎడిటర్: శశాంక్ మాలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబాసాయి కుమార్ మామిడిపల్లి
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Advertisement
Author Image